Viral Video: ఈయన మామూలోడు కాదు.. ఏకంగా కొండ చిలువనే..! నెట్టింట్లో వైరలవుతోన్న వీడియో

జూలో ఉన్న ఓ వ్యక్తి తన భుజాలపై పెద్ద కొండచిలువను మోసుకెళ్లిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 2.7 లక్షలకు పైగా వీక్షణలు, 8,500కి పైగా లైక్‌లు వచ్చాయి.

Viral Video: ఈయన మామూలోడు కాదు.. ఏకంగా కొండ చిలువనే..! నెట్టింట్లో వైరలవుతోన్న వీడియో
Python Viral Video

Updated on: Jan 11, 2022 | 9:45 AM

Python Viral Video: పామును చూడగానే చాలామందికి మాటలు రావు. ఉన్న చోటనుంచి పరిగెడుతుంటారు. పాము చిన్నదైనా, పెద్దదైనా అందరూ దూరంగా ఉండటానికే ఇష్టపడతారని మనకు తెలుసు. అయితే నెట్టింట్లో మాత్రం పాముల వీడియోలు తెగ సందడి చేస్తుంటాయి. పాము తదుపరి కదలిక ఏమిటో ఊహించడం చాలా కష్టమని నిపుణులు అంటున్నారు. తాజాగా సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న ఓ వీడియో కూడా చాలా ప్రమాదకరంగానే అనిపించింది. ఈ వీడియోలో ఒక వ్యక్తి తన భుజంపై పెద్ద కొండచిలువను తీసుకెళ్తూ కనిపించాడు.

ఓ వ్యక్తి పెద్ద కొండచిలువతో వెళ్తున్న దృశ్యాన్ని వీడియోలో చూడవచ్చు. ఈ వీడియోలో, ఒక వ్యక్తి అతని భుజంపై పెద్ద కొండచిలువను తీసుకెళ్తున్నట్లు చూడొచ్చు. కొండచిలువ చాలా పొడవుగా ఉంది. అది సగం నేలపై ఉంటుంది. తల భాగం గాలిలో ఉంటుంది. కొండచిలువను బస్తాలు మోసినట్లుగా తీసుకపోతుంటాడు. ఈ కొండచిలువను ఓ గదిలోకి తీసుకువెళుతున్నట్లు మనం వీడియోలో చూడొచ్చు. ఇది చూసిన తర్వాత ప్రజలు చాలా ఆశ్చర్యపోతున్నారు. ఎన్నో కామెంట్లతో తమ ఇష్టాన్ని కూడా చూపిస్తున్నారు.

ఈ వ్యక్తిని చూస్తుంటే ఎప్పుడూ ఈ పాముతోనే జీవిస్తున్నట్లు అనిపిస్తుంది. వీడియోలో పాముతో సరదాగా గడుపుతున్నాడు. ఈ వీడియో ‘హెప్‌గుల్5’ పేరుతో ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఈ వీడియోను ఇప్పటి వరకు వేల మంది వీక్షించారు. కొంతమంది ఈ వీడియోను చాలా ఫన్నీగా ఉందంటూ కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు మాత్రం ఆశ్చర్యపోతున్నారు. ఈ వీడియో కామెంట్ సెక్షన్‌లో కూడా వేల సంఖ్యలో స్పందనలు కనిపిస్తున్నాయి. ఈ వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్‌గా మారింది. ఇప్పటి వరకు 2.7 లక్షలకు పైగా వీక్షణలు, 8,500కి పైగా లైక్‌లతో నెట్టింట్లో దూసుకపోతోంది. ‘ఈ వీడియో ఇండోనేషియాకు చెందినది’ అని ఒకరు కామెంట్ చేయగా, ‘చూడ్డానికే చాలా భయంగా ఉంది. ఎలా మోస్తున్నావ్ బ్రో’ అంటూ మరొకరు కామెంట్ చేశారు.

Also Read: Viral Video: బెలూన్‌తో వాలీబాల్ ఆడిన శునకాలు.. వీడియో చూస్తే మీరే వావ్ అంటారు..

Video Viral: పెళ్లి కూతురికి స్వీట్ తినిపించాలనుకున్నాడు.. కానీ వధువు చేసిన పనికి వరుడి ఫ్యూజులు ఔట్.. నవ్వులు పూయిస్తున్న వీడియో..