కట్టుతప్పి వీధుల్లో పరుగులు పెట్టిన గుర్రాలు.. హడలెత్తిన జనం ఏ చేశారంటే
కోయంబత్తూరులో రద్దీగా ఉన్న రోడ్లపై మూడు గుర్రాలు కట్టుతప్పి పరుగులు తీశాయి. వాహనాలను ఢీకొట్టి, పలువురికి గాయాలు కలిగించాయి. గతంలో లండన్‌లో కూడా ఇలాగే సైనిక గుర్రాలు అదుపుతప్పి రోడ్లపై పరుగులు తీసి భయాందోళనలు సృష్టించాయి. ఈ ఘటనలు పట్టణ ప్రాంతాల్లో అకస్మాత్తుగా గుర్రాలు రోడ్లపైకి వస్తే ఎదురయ్యే ప్రమాదాలను తెలియజేస్తున్నాయి.
రద్దీగా ఉన్న రోడ్లపై రౌతులు లేకుండా పరుగులు తీస్తూ గుర్రాలు జనాలను హడలెత్తించాయి. వీటి నుంచి తప్పించుకోడానికి వాహనదారులు నానా అవస్థలు పడ్డారు. ఈ క్రమంలో పలువురికి గాయాలయ్యాయి. కోయంబత్తూరులోని రద్దీ రోడ్డుపై మూడు గుర్రాలు కట్టుతప్పి రోడ్లపై పరుగులు తీశాయి. ఎదురుగా వచ్చిన వాహనాలను ఢీకొంటూ అడ్డం వచ్చిన వారిని తొక్కుకుంటూ ముందుకెళ్లాయి. బలిష్ఠంగా ఉన్న ఆ గుర్రాల నుంచి తప్పుకొనేందుకు చేసిన ప్రయత్నంలో కొందరు గాయపడ్డారు. మేటుపాళయం రోడ్డులో అకస్మాత్తుగా మూడు గుర్రాలు రోడ్డుకు అడ్డంగా పరిగెత్తాయి. ఇద్దరు స్కూల్ పిల్లలతో కలిసి స్కూటీపై వెళ్తున్న మహిళను అవి ఢీకొట్టాయి. దీంతో స్కూటీ అదుపుతప్పడంతో ఆ మహిళ, ఇద్దరు పిల్లలు రోడ్డుపై పడ్డారు. ఆ ముగ్గురు స్వల్పంగా గాయపడ్డారు. అక్కడున్న జనం వెంటనే స్పందించారు. రోడ్డుపై పడిన మహిళ, స్కూల్ విద్యార్థులకు సహాయం చేశారు. గుర్రాలను దూరంగా తరిమారు. ఈ ఆకస్మిక సంఘటనకు అక్కడున్న వారు షాక్ అయ్యారు. ఒక వ్యక్తి మొబైల్‌లో తీసిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. గతేడాది ఏప్రిల్‌లో ఓ ఐదు గుర్రాలు ఒక్కసారిగా కట్లు తెంచుకుని లండన్ రోడ్ల మీదకు రావడంతో జనం భయపడిపోయారు. ముందు వెనుకా చూడకుండా పరుగులు తీసిన ఆ గుర్రాలు.. ఎదురొచ్చిన కార్లు, బస్సులను ఢీకొట్టి, మనుషులను కుమ్ముకుంటూ ముందుకెళ్లాయి. అలా ఐదు మైళ్లకుపైగా అవి పరిగెత్తాయి. ఒక గుర్రం గాయపడింది. అతికష్టమ్మీద వాటిని అధికారులు పట్టుకున్నారు. ఏం జరిగిందంటే. కింగ్ ఛార్లెస్ బర్త్‌డే వేడుక కోసం రిహార్సిల్ నిర్వహిస్తున్నారు. బకింగ్‌హమ్ ప్యాలెస్ దగ్గర నిర్మాణంలో ఉన్న ఓ భవనం నుంచి భారీ శబ్దం వచ్చింది. దీంతో ఆ శబ్దానికి భయపడిపోయిన సైనిక గుర్రాలు రోడ్ల మీదకు వచ్చి పరుగులు తీశాయి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
గోవాలో సమీరా రెడ్డి అరటి పండ్లు.. అసలు కథ ఇదే అంటున్న ముద్దుగుమ్మ