చిన్నారి చేసిన పనికి చలించిపోయిన దొంగ.. కంటతడి పెట్టిస్తున్న వీడియో

Updated on: Nov 20, 2025 | 7:27 PM

ఓ చిన్నారి అమాయకత్వం దొంగ మనసును ఎలా మార్చిందో తెలియజేసే వైరల్ వీడియో సోషల్‌ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. దోపిడీకి వచ్చిన దొంగకు చిన్నారి లాలీపాప్ ఇవ్వడంతో అతను చలించిపోయి దొంగలించిన డబ్బును తిరిగి ఇచ్చేసి, క్షమాపణ చెప్పి వెళ్లిపోయాడు. పసిపిల్లల స్వచ్ఛమైన మనసు ఏదైనా మార్చగలదని ఈ హృదయపూర్వక సంఘటన నిరూపిస్తుంది. ఇది నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది.

పసిపిల్లలు దేవుడితో సమానం అంటారు. ఆ అమాయకపు ముఖం, కల్లాకపటం ఎరుగని స్వచ్ఛమైన మనసుకు ఎంతటి రాతిగుండె అయినా కరిగిపోవాల్సిందే. దోపిడీ చేయడానికి వచ్చిన దొంగను మార్చడమే కాకుండా తన తండ్రిని కాపాడుకుంది ఓ చిన్నారి. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. ఈ వీడియో నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది. నెట్టింట వైరల్‌ అవుతున్న ఈ వీడియోలో ఓ చిన్నారి తన తండ్రితో కలిసి షాపులో కూర్చుని ఉంది. అది రోడ్డు పక్కన ఉన్న ఒక చిన్న దుకాణం. తండ్రి కౌంటర్‌లో కూర్చొని వ్యాపారం చూసుకుంటుండగా..చిన్నారి పక్కనే మరో కుర్చీలో కూర్చుని లాలీపాప్‌ తింటోంది. ఇంతలో ముసుగు ధరించిన ఓ వ్యక్తి ఆ దుకాణానికి వచ్చాడు. తన తండ్రిని బెదిరించి, డ్రాలోని డబ్బులు కూడా తీసేసుకున్నాడు. అక్కడితో ఆగకుండా అతన్ని కొట్టి అతని సెల్‌ ఫోన్‌తోపాటు, అతని వద్ద ఉన్న డబ్బుకూడా తీసేసుకున్నాడు. తనపై తిరిగి దాడిచేయకుండా అతన్ని కొడుతున్నాడు. ఇదంతా గమనించిన చిన్నారి భయంతో తన వద్ద ఉన్న లాలీపాప్‌ కూడా ఆ దొంగకు ఇచ్చేసింది. చిన్నారి లాలీపాప్‌ ఇస్తుండటంతో ఆ దొంగ చలించిపోయాడు. తన ప్రవర్తన అమాయకమైన చిన్నారిని ఎంత భయపెట్టిందో అతడికి అర్ధమైంది. వెంటనే అతను అక్కడ దోచుకున్న డబ్బు మొత్తం చిన్నారి తండ్రికి తిరిగి ఇచ్చేశాడు. చిన్నారిని ముద్దాడి, ఆ లాలీపాప్‌ ను తినమని పాపకు చెప్పి, ఆమె తండ్రికి క్షమాపణ చెప్పి అక్కడినుంచి వెళ్లిపోయాడు. ఈ ఘటన మొత్తం అక్కడి సీసీ కెమెరాలో రికార్డయింది. ఈ వీడియోను ఓ యూజర్‌ తన ఎక్స్‌ ఖాతాలో షేర్‌ చేశారు. ఈ వీడియోను లక్షలాదిమంది వీక్షించారు. వేలాదిమంది షేర్‌ చేశారు. తమదైన శైలిలో కామెంట్లు చేశారు. ఒక పసిమనసు కఠినమైన దొంగ గుండెను కరిగేలా చేసింది. అందుకే పిల్లలు దేవుడితో సమానం అంటారు. ప్రతి ఒక్కరిలోనూ మంచి హృదయం ఉంటుంది. అది ఎప్పుడో అప్పుడు బయటపడుతుంది అంటూ కామెంట్లు చేశారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. ఇవాళ తులం ఎంతంటే ??

ఉచితగా AI కోర్స్ ఈ విధంగా నేర్చుకోండి.. జీవితంలో సెటిల్ అవ్వండి

సార్‌ టాలెంట్‌ మామూలుగా లేదు.. స్మగ్లింగ్ లో సరికొత్తగా ట్రై చూసారుగా

అరే.. బాబు అవి పాములు రా.. పొట్లకాయలు కాదు.. మీకు వీడియో చూసే ధైర్యముందా

Priyanka Chopra: ప్రియాంక తెలుగు ఎంత క్యూట్‌గా ఉందో