Watch: కోడిని పట్టినట్టు ఏకంగా చిరుతనే పట్టేశారుగా.! వీడియో వైరల్..

|

Dec 10, 2024 | 3:44 PM

ఇటీవల తరచూ క్రూర మృగాలు జనావాసాల్లోకి చొరబడుతూ ప్రజలను తీవ్ర భయాందోళనకు గురి చేస్తున్నాయి. అడవులను వదిలి గ్రామాల్లోకి ఎంట్రీ ఇస్తున్న జంతువులు మనుషులు, పశువులపై దాడులకు పాల్పడుతున్నాయి.. ప్రాణాలు తీస్తున్నాయి. ఇటీవల ఇలాంటి ఎన్నో ఘటనలు మనం చూశాం. తాజాగా ఉత్తరప్రదేశ్‌లోకి ఓ గ్రామంలోకి చొరబడిన చిరుతను గ్రామస్తులే బంధించి అటవీ సిబ్బందికి అప్పగించారు.

ఉత్తరప్రదేశ్‌లో మహరాజ్‌గంజ్‌లోని లాల్‌పూర్‌లో కొద్దిరోజులుగా చిరుత సంచరిస్తుండటంతో గ్రామస్తులు అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. అయితే అటవీశాఖ స్పందించక పోవడంతో స్వయంగా గ్రామస్తులే చిరుతను బంధించేందుకు రంగంలోకి దిగారు. అధికారులు చర్యలు తీసుకునేలోపు ఏమైనా జరగొచ్చని, ఏదొక రోజు చిరుతకు బలైపోతామనే భయంతో గ్రామస్తులే చిరుతను బంధించారు. దానికోసం వారేమీ వలలు పన్నలేదు, ఉచ్చులు ఏర్పాటు చేయలేదు. కేవలం ఒట్టి చేతులతోనే కోడిని పట్టుకున్నట్టు చిరుతను పట్టేసుకున్నారు. అనంతరం అటవీ సిబ్బందికి సమాచారమిచ్చారు. కొంతమంది యువకులు కలిసి ఎంతో శ్రమించి చిరుతను బంధించారు. ఈ వీడియోను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తూ.. ‘‘చిరుత సంచారంతో జనాలు బెదిరిపోయారు. అటవీ శాఖ ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో వారిలో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. చివరకు వారే స్వయంగా రంగంలోకి దిగారు. చాలా శ్రమపడి దాన్ని అదుపులోకి తీసుకున్నారు’’ అంటూ ఓ వ్యక్తి ఈ వీడియోను షేర్ చేశారు. కాగా, వీడియోపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. నమ్మశక్యంగా లేదు అని కొందరు కామెంట్ చేశారు. ‘‘వారు దాని గొంతును గట్టిగా పట్టుకున్నారు. దానికి ఊపిరాడక చనిపోయే ప్రమాదం ఉంది’’ అని మరో వ్యక్తి ఆందోళన వ్యక్తం చేశారు. ఇది నిజంగా దారుణం అని అనేక మంది వాపోయారు. ఇలా రకరకాల కామెంట్స్ మధ్య ఈ ఘటన తెగ ట్రెండవుతోంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.