Attack on MLA: ఎమ్మెల్యేను బట్టలు చింపేసి, తరిమి కొట్టిన గ్రామస్తులు..! ఎందుకంటే..?

|

Nov 26, 2022 | 9:42 AM

కర్నాటకలోని చిక్‌మగళూర్‌ జిల్లా ముడిగెరె బీజేపీ ఎమ్మెల్యేకు చేదు అనుభవం ఎదురయ్యింది. బీజేపీ ఎమ్మెల్యే కుమారస్వామిపై కుందూరు గ్రామస్తులు దాడి చేశారు. ఏకవచనాల్లో ప్రశ్నించడం మొదలుపెట్టి,


కర్నాటకలోని చిక్‌మగళూర్‌ జిల్లా ముడిగెరె బీజేపీ ఎమ్మెల్యేకు చేదు అనుభవం ఎదురయ్యింది. బీజేపీ ఎమ్మెల్యే కుమారస్వామిపై కుందూరు గ్రామస్తులు దాడి చేశారు. ఏకవచనాల్లో ప్రశ్నించడం మొదలుపెట్టి, దూషించి, ఎమ్మెల్యే బట్టలు చింపేశారు. ఆయన వాహనాన్ని ధ్వంసం చేశారు. ఏనుగుల గుంపు దాడిలో ఓ మహిళ చనిపోవడంతో స్థానికులు చేపట్టిన నిరసన హింసాత్మకంగా మారింది. ఏనుగుల సంచారంపై పలుమార్లు ఫిర్యాదు చేసినప్పటికి ఎమ్మెల్యే కుమారస్వామి పట్టించుకోలేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. చనిపోయిన స్థానిక మహిళ శోభ కుటుంబాన్ని పరామర్శించడానికి వచ్చిన సమయంలో ఆయనపై దాడి జరిగింది. ఏనుగుల బెడదపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని, ఉదయం నుంచి ఆందోళన చేస్తున్నప్పటికీ ఆలస్యంగా రావడంపై గ్రామస్థులు బీజేపీ ఎమ్మెల్యేపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బట్టలు చింపేసి, కొట్టడం మొదలుపెట్టారు. ఎమ్మెల్యే కుమారస్వామిని చుట్టుముట్టిన గుంపును అదుపు చేసేందుకు పోలీసులు లాఠీచార్జి చేయాల్సి వచ్చింది. మరోవైపు పోలీసు శాఖ తనకు రక్షణ కల్పించడంలో విఫలమైందని ఎమ్మెల్యే కుమారస్వామి ఆరోపించారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Dog saved cat: పిల్లిపిల్లను కాపాడేందుకు కుక్క ప్లాన్‌ అదుర్స్‌..! కుక్కపై ప్రశంసలు.. వైరల్‌ అవుతున్న క్యూట్‌ వీడియో.

David Warner As Dj Tillu: డీజే టిల్లు గెటప్‌లో అదరగొట్టిన డేవిడ్‌ వార్నర్‌.. అదరహో అనిపించేలా వార్నర్‌ న్యూలుక్‌..

Alien Birth: బీహార్‌లో వింత శిశువు.. గ్రహాంతరవాసి జననం..? వీడియో చూసి తెగ షేర్ చేస్తున్న నెటిజన్స్..

Published on: Nov 26, 2022 09:42 AM