Viral Video: ఇదో తల్లి- బిడ్డల ప్రేమకథ. తల్లి కుక్క ఆవేదన.. నా పిల్లలను కాపాడయ్యా..!

|

Aug 05, 2023 | 8:22 PM

ఈ శునకం పడుతున్న వేదన అక్కడున్న పోలీసుల్ని కూడా కదిలించింది. వరద వచ్చే ముందు రోజుల వయుసున్న తన రెండు పిల్లల్ని ఓ ఇంటి ముందు వచ్చి ఆహారం కోసం బయటకు వచ్చింది ఈ కుక్క. ఆహారాన్ని తీసుకొచ్చే లోపే ఒక్కసారిగా ఆ ఇంటిని వరద చుట్టుముట్టేసింది. ప్రవాహ వేగానికి తన బిడ్డలున్న ఇంటిని చేరుకోలేకపోయింది ఈ తల్లి. తన బిడ్డల్ని ఎలాగైనా కాపాడుకోవాలన్న తాపత్రయం ఈ తల్లి శునకానిది.

నిజంగా జరిగిన కథ.. జరిగిన కథ అంటే ఎప్పుడో కాదు.. నిన్ననే జరిగింది. మనిషైనా, పక్షి అయినా, జంతువైనా.. కన్నతల్లి ప్రేమలో ఎలాంటి తేడా ఉండదనడానికి ఏపీలోని నందిగామ వద్ద జరిగిన ఈ ఘటన సజీవ సాక్ష్యం. ఈ శునకం పడుతున్న వేదన అక్కడున్న పోలీసుల్ని కూడా కదిలించింది. వరద వచ్చే ముందు రోజుల వయుసున్న తన రెండు పిల్లల్ని ఓ ఇంటి ముందు వచ్చి ఆహారం కోసం బయటకు వచ్చింది ఈ కుక్క. ఆహారాన్ని తీసుకొచ్చే లోపే ఒక్కసారిగా ఆ ఇంటిని వరద చుట్టుముట్టేసింది. ప్రవాహ వేగానికి తన బిడ్డలున్న ఇంటిని చేరుకోలేకపోయింది ఈ తల్లి. తన బిడ్డల్ని ఎలాగైనా కాపాడుకోవాలన్న తాపత్రయం ఈ తల్లి శునకానిది. కానీ తన వేదనను అక్కడున్న వారికి అర్థమయ్యేలా చెప్పేందుకు ఎన్ని ప్రయత్నాలు చెయ్యాలో అన్నీ చేసింది. చివరకు ఆ తల్లికుక్క తాపత్రయాన్ని చూసిన మహిళా కానిస్టేబుళ్లు వరద తగ్గిన తర్వాత ఆ ఇంటి దగ్గరకు వెళ్లి జాగ్రత్తగా ఆ పిల్లల్ని బయటకు తీసుకొచ్చారు . శరీరం నిండా మట్టి పేరుకుపోయిన వాటిని అక్కడే శుభ్రంగా స్నానం చేయించి తల్లి దగ్గరకు వదిలారు. అంతే.. ఒక్కసారిగా తల్లిదగ్గరకు పరిగెత్తుకెళ్లాయి. ప్రాణాలతో బయట పడ్డ తన బిడ్డల్ని చూసిన ఆ శునకం ఆనందానికి అంతే లేదు. కానీ మనిషి భాష రాదు కదా..

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్‌..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్‌ ఓవరాక్షన్‌...