Tiger Video: ఆంధ్రా,ఒరిస్సా ప్రజలను హడలెత్తిస్తున్న పెద్దపులి.. ట్రాప్‌ కెమెరాల్లో రికార్డయిన పులి.

|

Oct 22, 2023 | 7:51 PM

శ్రీకాకుళo జిల్లాలోని సరిహద్దు మండలాల ప్రజలు గజగజ వణుకుతున్నారు. గండాహతి పంచాయితీ పరిధిలోని సంతోష్ పూర్ గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి అక్టోబరు 18న గ్రామ శివారులోని కొండవద్ద ఆవు కళేబరం లభ్యమైంది. ఘటనా స్థలికి చేరుకున్న అటవీశాఖ సిబ్బంది సమీప ప్రాంతాన్ని పరిశీలించగా ఓ జంతువు పాద ముద్రలను గుర్తించారు. పాదముద్రలను ఫోటోలు తీసి భువనేశ్వర్ లోని ఫోరెన్సిక్ ల్యాబ్ కి పంపగా అవి పెద్ద పులి పాద ముద్రలుగా గుర్తించారు.

శ్రీకాకుళo జిల్లాలోని సరిహద్దు మండలాల ప్రజలు గజగజ వణుకుతున్నారు. గండాహతి పంచాయితీ పరిధిలోని సంతోష్ పూర్ గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి అక్టోబరు 18న గ్రామ శివారులోని కొండవద్ద ఆవు కళేబరం లభ్యమైంది. ఘటనా స్థలికి చేరుకున్న అటవీశాఖ సిబ్బంది సమీప ప్రాంతాన్ని పరిశీలించగా ఓ జంతువు పాద ముద్రలను గుర్తించారు. పాదముద్రలను ఫోటోలు తీసి భువనేశ్వర్ లోని ఫోరెన్సిక్ ల్యాబ్ కి పంపగా అవి పెద్ద పులి పాద ముద్రలుగా గుర్తించారు. దాంతో అప్రమత్తం అయిన అటవీశాఖ అధికారులు సమీప గ్రామాల ప్రజలను అలెర్ట్ చేశారు. పాదముద్రలు గుర్తించిన ప్రాంతాలలో ఐదు ట్రాప్ కెమెరాలను అమర్చగా రెండు కెమెరాలలో పెద్ద పులి సంచారం స్పష్టంగా రికార్డ్ అయ్యింది. ప్రజలెవరూ ఒంటరిగా సంచరించవద్దని, పెంపుడు జంతువులను శివారు ప్రాంతాలకు విడిచిపెట్టవద్దని హెచ్చరించారు అటవీశాఖ అధికారులు. దసరా పండుగ సందర్భంగా గండాహతి జలపాతానికి వెళ్లే సందర్శకులు మరింత అప్రమత్తంగా ఉండాలని ఒడిస్సా అటవీశాఖ అధికారులు తెలిపారు. పలు బృందాలుగా ఏర్పడి పెద్ద పులి జాడను ట్రేస్ చేసే ప్రయత్నాలు చేపట్టారు. ఆంధ్ర, ఒరిస్సా సరిహద్దు ప్రాంత ప్రజలను అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ పెద్దపులి గతంలో శ్రీకాకుళo జిల్లాలో సంచరించిందేనా అనే కోణంలో అధికారులు పరిశీలిస్తున్నారు. ఓ పెద్దపులి గత కొద్ది రోజుల వరకు ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలోనే తిష్ట వేసింది. జిల్లాలోని సీతంపేట,భామిని,కొత్తూరు, మెలియాపుట్టి ,L.N. పేట,సరుబుజ్జిలి మండలాల్లో సంచరిస్తూ స్థానికులను గడగడ లాడించింది. ఎక్కడ మనుషులపై దాడి చేసిన దాఖలాలు లేనప్పటికీ ఆవులు,మేకలు,గొర్రెలు, పెంపుడు జంతువులను మట్టు బెడుతూ భయబ్రాంతులకు గురిచేసింది. అయితే గత కొద్ది రోజులుగా పెద్దపులి జాడ జిల్లాలో పెద్దగా కనిపించకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు ప్రజలు. ఇంతలోనే ఒరిస్సా సరిహద్దు ప్రాంతంలో పులి సంచారం సరిహద్దు ప్రాంత ప్రజలను భయాందోళనకు గురిచేసింది. అటవీశాఖ అధికారులు తగిన చర్యలు చేపట్టి తమకు తగిన రక్షణ కల్పించాలని కోరుతున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..