నవీముంబై ఇస్కాన్ ఆలయాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ వీడియో
నవీముంబైలో ఇస్కాన్ ఆలయాన్ని ప్రారంభించారు ప్రధాని మోదీ.. ఇస్కాన్ సంస్థ సేవలను ప్రధాని కొనియాడారు. భగవద్గీతతో పాటు వేదాల ప్రశస్తిని ఇస్కాన్ సంస్థ ప్రచారం చేసిందన్నారు. ఇస్కాన్ సంస్థ సేవాభావం అందరికి ఆదర్శమన్నారు. ఇస్కాన్ బోధనలు అందరికి ఆదర్శమన్నారు మోదీ. ఇస్కాన్ సంస్థ సేవా కార్యక్రమాల నుంచి ఎంతో స్ఫూర్తిని పొందినట్టు చెప్పారు మోదీ.
ఇస్కాన్ సంస్థ స్ఫూర్తి తోనే తమ ప్రభుత్వం దేశంలోని ప్రతి ఒక్క ఇంటికి మంచినీటి వసతిని కల్పించామన్నారు. పేదల కోసం ఆయుష్మాన్ భారత్ స్కీమ్‌ను , మహిళల కోసం ఉజ్వల పథకాన్ని అమలు చేస్తునట్టు చెప్పారు.మహారాష్ట్రలోని నవీ ముంబైలోని ఖర్ఘర్‌లోని సెక్టార్ 23లో ఉన్న ఈ ఆలయాన్ని నిర్మించడానికి మొత్తం 12 సంవత్సరాలు పట్టింది. ఈ గొప్ప దేవాలయం తెలుపు, గోధుమ రంగు ఉన్న ప్రత్యేక పాల రాళ్లతో నిర్మించబడింది. ప్రధాని మోడీ గతంలో 2024 అక్టోబర్ 12న ఆలయాన్ని సందర్శించారు. పాలరాతితో నిర్మించిన ఈ ఆలయాన్ని 200 కోట్ల రూపాయలతో నిర్మించారు. జనవరి 15న ప్రధాని మోడీ ప్రారంభించనున్న ఈ ఆలయంలో శ్రీ కృష్ణుడి జన్మ రహస్యం, శ్రీ కృష్ణుడి లీలలకు సంబంధించిన 3డీ చిత్రాలతో ఆలయ ఆస్థానం అలంకరించబడింది.