Jai Shri Ram: చైనా సైనికుల నోట ‘జై శ్రీరామ్‌’ నినాదాలు.! షాక్‌కు గురవుతున్న నెటిజన్లు.

|

Jan 24, 2024 | 6:39 PM

వందల ఏళ్ల నీరిక్షణ సాకారమైంది. కోట్లాది మంది భక్తుల కలను నిజం చేస్తూ ఆయోధ్యలో అద్భుతం ఆవిష్కృతమైంది. భవ్య రామమందిరంలో దివ్య రాముడు కొలువుదీరాడు. జనవరి 22న ప్రధాని మోదీ చేతుల మీదుగా బాలరాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. ఒక్క అయోధ్యలోనే కాదు.. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ఆలయాల్లో ప్రజలు ఈ వేడుకను వైభవంగా జరుపుకున్నారు.

వందల ఏళ్ల నీరిక్షణ సాకారమైంది. కోట్లాది మంది భక్తుల కలను నిజం చేస్తూ ఆయోధ్యలో అద్భుతం ఆవిష్కృతమైంది. భవ్య రామమందిరంలో దివ్య రాముడు కొలువుదీరాడు. జనవరి 22న ప్రధాని మోదీ చేతుల మీదుగా బాలరాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. ఒక్క అయోధ్యలోనే కాదు.. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ఆలయాల్లో ప్రజలు ఈ వేడుకను వైభవంగా జరుపుకున్నారు. జై శ్రీరామ్‌ అంటూ భక్తి పారవశ్యంలో మునిగితేలారు. ఈ క్రమంలోనే చైనా సైనికులు ‘జై శ్రీరామ్‌’ అంటూ నినాదాలు చేసిన ఓ వీడియో వెలుగులోకి వచ్చింది. వాస్తవాధీన రేఖ వెంట భారత సైన్యంతో కలిసి చైనా భద్రతా దళాలు నినాదాలు చేసారు. భారత్‌-చైనా సరిహద్దులో వాస్తవాధీన రేఖ వెంట కొంతకాలంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సమస్యల పరిష్కారం కోసం ఇరు దేశాల సైనికాధికారులు పలుమార్లు చర్చలు జరుపుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఓ ఆసక్తికర ఘటన వెలుగుచూసింది. ‘జై శ్రీరామ్‌’ నినాదాన్ని ఎలా ఉచ్చరించాలన్న విషయాన్ని చైనా భద్రతా దళాలకు భారత్‌ సైనికులు చెబుతున్నట్లు ఆ వీడియోలో ఉంది. అందుకు తగినట్లుగానే చైనా సైనికులు ‘జై శ్రీరామ్‌’ నామస్మరణ చేయడం కనిపించింది. అయోధ్యలో ప్రాణప్రతిష్ఠ జరిగిన రోజే ఓ మాజీ సైనికుడు దీన్ని ‘ఎక్స్‌’లో షేర్‌ చేయడంతో అది కాస్త వైరల్‌గా మారింది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos