Nirmal: వరదలో అంతిమ యాత్ర.. ఆఖరి మజిలీకి తిప్పలు… వీడియో వైరల్..

|

Sep 07, 2021 | 8:52 AM

భారీ వర్షాలతో పల్లెలు పట్టణాలు అతలాకుతలమవుతున్నాయి. వరద నీటితో రహదారులు నదులను తలపిస్తున్నాయి. గ్రామాల్లో ఎడతెరిపి లేని వర్షాలకు రాకపోకలు నిలిచిపోతున్నాయి. వరద నీటితో జనజీవనం స్తంభించిపోతోంది. చివరికి ఎవరైనా మరణించినా అంత్య క్రియలు నిర్వహించాలంటే నానా ఇబ్బందులు పడుతున్నారు జనం.

నిర్మల్ జిల్లాలో కురుస్తున్న వర్షాలతో దారులన్నీ వరదనీటితో నిండియాయి. పలు గ్రామాలు జల దిగ్బంధనంలో చిక్కుకున్నాయి. దారులు తెగిపోవడంతో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. అనారోగ్యం పాలైనా ధవాఖనాకు వెళ్లే దారిలేక అనేక ఇబ్బందులు పడుతున్నారు. దురదృష్టవశాత్తు అనారోగ్యంతో ఎవరైనా మరణించినా వారి అంతిమ యాత్రకు సైతం అష్టకష్టాలు పడాల్సి వస్తోంది.ముధోల్ మండలం చింతకుంట గ్రామంలో పోతన్న అనే వ్యక్తి అనారోగ్యంతో మృతి చెందాడు.. సెప్టెంబర్‌ 4న అంత్యక్రియలు జరిగాయి. రెండు రోజులుగా కురిసిన వర్షాలతో గ్రామంలో చెరువు పొంగడంతో దారులన్నీ నీటిలో మునిగిపోయాయి. వైకుంఠదామానికి‌ వెళ్లేదారి మొత్తం నీటిలో మునిగిపోవడంతో మృతుడి బంధువులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మోకాళ్ల లోతు నీటిలో పాడెను మోస్తూ వైకుంఠదామానికి చేరుకొని అంత్యక్రియలు నిర్వహించారు. వైకుంఠ దామానికి దారి లేక అంతిమయాత్ర అష్టకష్టాలు పడుతూ సాగాల్సిన పరిస్థితి రావడం బాధకరమని గ్రామస్తులు వాపోతున్నారు.

YouTube video player
మరిన్ని ఇక్కడ చూడండి: Wipes Shoes Video: భక్తుల బూట్లు తుడిచిన మాజీ సీఎం..! వైరల్ అవుతున్న వీడియో..

 డేంజర్ గా మారుతున్న వెదర్.. తెలుగు రాష్ట్రాల్లో అలెర్ట్.. మరో మూడు రోజులు భారీ వర్షాలు: Heavy Rains Live Video.

Mahesh Babu Shoot Leak Video: బాలీవుడ్‌ స్టార్‌తో ప్రిన్స్‌ మహేష్‌ మూవీ..లీకైన షూట్‌ వీడియో..

వీరమాచినేని సూచించే డైట్ తీస్కోవాలా..? వద్దా..? డైట్ పై డౌట్స్ ఎందుకు..?(వీడియో):Veeramachaneni Vs Indian Medical Association video.