boy save cat: ఓర్నీ.. ఈ బుడ్డోడు పిల్లిని భలే కాపాడాడుగా.. వీడియో చూసి మెచ్చుకోక తప్పదు..
ప్రస్తుతం నెట్టింట్లో ఓ అద్భుతమైన వీడియో వైరల్ అవుతోంది. ఇందులో ఓ బాలుడు పిల్లిని ఎంతో చాకచక్యంగా కాపాడాడు. అది చూసి నెటిజన్లు ఓర్నీ..
ప్రస్తుతం నెట్టింట్లో ఓ అద్భుతమైన వీడియో వైరల్ అవుతోంది. ఇందులో ఓ బాలుడు పిల్లిని ఎంతో చాకచక్యంగా కాపాడాడు. అది చూసి నెటిజన్లు ఓర్నీ.. ఈ బుడ్డోడి తెలివి మామూలుగా లేదుగా అంటూ ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. అసలేం జరిగిందంటే…వైరల్ అవుతున్న వీడియోలో… ఒక ఎత్తయిన గోడపైన ఒక తెల్లని పిల్లి ఉంది. అది కిందకి దూకడానికి ప్రయత్నిస్తుంది. అయితే గోడ చాలా ఎత్తుగా ఉండటంతో దూకడానికి భయపడుతోంది పిల్లి. ఈ పిల్లి అవస్థను అక్కడే ఉన్న ఓ చిన్నారి గమనించాడు. ఎలాగైనా దానికి సహాయం చేయాలనుకున్నాడు. అయితే ఈ పిల్లవాడు కూడా చిన్నవాడే.. గోడ అతనికీ అందడంలేదు. దాంతో అతడు ఓ ప్లాన్ చేశాడు..సమీపంలో కనిపించిన ఒక త్రిభుజాకారంలో ఉన్న స్టాపర్‌ని తన చేతితో పైకి లేపి, పిల్లిని దానిలోకి దూకమని చెప్పాడు. అందులో దూకడానికి కూడా పిల్లి భయపడటంతో.. బాలు వెళ్లి ఒక పెద్ద అట్ట పెట్టెను తీసుకువచ్చాడు. దాన్ని పిల్లికి ఎదురుగా పెట్టి పట్టుకున్నాడు. అప్పుడు పిల్లి ధైర్యంగా ఆ పెట్టెలోకి దూకింది. దాంతో బాలుడు తన తలపై పెట్టెను జాగ్రత్తగా కిందకు దించాడు. అలా పిల్లిని కాపాడాడు. ఈ వీడియో పోస్ట్ చేసిన వెంటనే వైరల్‌గా మారింది. వీడియో చూసిన నెటిజన్లు తమదైన స్టైల్లో కామెంట్స్ చేస్తున్నారు. బాలుడి ఔదర్యాన్ని ఎంతగానో ప్రశంసిస్తున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Collector-student: కలెక్టరమ్మకూ తప్పని తిప్పలు.. క్లాస్ రూమ్‌లోకి వెళ్లనని తనయుడు మారం..
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

