Monkey Viral Video: నువ్వు దేవుడివి బాస్‌.. ఇదికదా అసలైన మానవత్వం అంటే.. కోతిపిల్లకు పునర్జన్మ ఇచ్చినట్టే.

|

May 15, 2023 | 9:39 AM

ఓ కోతి పిల్ల ఒళ్లంతా ప్లాస్టిక్‌ తీగలు చట్టుకుపోయి, బురదలో చిక్కుకుపోయి ఎటూ కదల్లేని స్థితిలో, ప్రాణాలు చిక్కబట్టుకొని బిక్కుబిక్కుమంటూ చూస్తోంది. ఎవరూ దాన్ని చూసి ఉండకపోతే ఆకలితో అలమటిస్తూ మరణించేది. కానీ, ఆ చిన్ని ప్రాణిని ఓ వ్యక్తి చూసాడు.

ఓ కోతి పిల్ల ఒళ్లంతా ప్లాస్టిక్‌ తీగలు చట్టుకుపోయి, బురదలో చిక్కుకుపోయి ఎటూ కదల్లేని స్థితిలో, ప్రాణాలు చిక్కబట్టుకొని బిక్కుబిక్కుమంటూ చూస్తోంది. ఎవరూ దాన్ని చూసి ఉండకపోతే ఆకలితో అలమటిస్తూ మరణించేది. కానీ, ఆ చిన్ని ప్రాణిని ఓ వ్యక్తి చూసాడు. దాని పరిస్థితి అర్ధమై వెంటనే దాన్ని కాపాడాలని రంగంలోకి దిగాడు. కోతి పిల్లను వెంటనే తన చేతుల్లోకి తీసుకున్నాడు. భయం లేదంటూ ఆచిన్నిప్రాణికి భరోసా ఇచ్చాడు. ఆ తరువాత అతి జాగ్రత్తగా దాని వంటి మీద ఉన్న తీగలన్నీ తొలగించాడు. మొదట ఆ కోతి పిల్ల అతను తననేం చేస్తాడోనని భయపడింది. దగ్గరకు రానీయలేదు. కానీ, అతడు ఆ కోతిపిల్లకు చుట్టుకున్న తీగలు జాగ్రత్తగా తొలగిస్తుంటే ఆ చిన్ని ప్రాణికి అర్ధమైంది అతను తనను కాపాడుతున్నాడు అని. అంతే వెంటనే అతని షర్టును గట్టిగా పట్టుకొని అలాగే ఉండిపోయింది. ఆ వ్యక్తి జాగ్రత్తగా తీగలన్నీ తొలగించాడు. తీగలనుంచి బయటపడిన ఆ చిన్నిప్రాణి కృతజ్ఞతగా అతని గుండెలపై వాలిపోయింది. అతను దానిని శుభ్రంచేసి, తినడానికి ఓ మామిడిపండును కూడా ఇచ్చాడు. ఆ పండును ఎంతో ఆత్రంగా తింటుంటే అతను ఆనందంతో మురిసిపోయాడు. నెట్టింట వైరల్‌గా మారిన ఈ వీడియో నెటిజన్లను బాగా కదిలించింది. మానవత్వం అంటే ఏంటో కళ్లకు కట్టినట్టు చూపించావంటూ కొందరు కామెంట్ చేశారు. ‘‘ఎందుకో కానీ ఆ కోతిని చూడగానే దాని బాధ నా మనసుకు తగిలింది. కానీ దేవుడు అప్పుడప్పుడూ నీలాంటి వారిని లోకంలోకి పంపిస్తుంటాడు’’ అంటూ మరో నెటిజన్ కోతిని రక్షించిన వ్యక్తిపై ప్రశంసలు కురిపించారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Jagapathi Babu – Rajinikanth: రజినీకాంత్ పై రాజకీయ విమర్శలు.. జగపతి బాబు రియాక్షన్..

Akhil Akkineni: ఒంటరైపోయిన అఖిల్.. డిప్రెషన్లో మరో దేశానికి..! ఎయిర్ పోర్ట్ లో వీడియో..

Naga Chaitanya vs Nagarjuna: ఆ విషయంలో తండ్రికి ఎదురునిలుస్తున్న నాగచైతన్య..!