ఒకేసారి 50 వాహనాలు పంక్చర్ !! సీన్ కట్ చేస్తే..

|

Jan 03, 2025 | 8:34 PM

రోడ్డుపై ఇనుప మేకులు, గాజు వస్తువులు, ఇతర కారణాలతో వాహనాలు పంక్చర్‌ కావడం చూస్తుంటాం. ఒకటో, రెండో వాహనాలు దెబ్బతినడాన్ని గమనిస్తాం. కానీ, ఒకేసారి 50 వాహనాలు పంక్చర్‌కు గురైన ఘటన మహారాష్ట్రలో జరిగింది. ముంబయి- నాగపూర్‌ సమృద్ధి హైవేపై జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

ఇటీవల రాత్రి 10 గంటల ప్రాంతంలో వాషిం జిల్లాలోని మాలెగావ్‌ మీదుగా వెళుతున్న కార్లు, ట్రక్కులు.. వరుసగా పంక్చర్‌ అయ్యాయి. దీంతో రహదారిపై కొన్ని గంటల పాటు ట్రాఫిక్‌ జామ్‌ అయింది. ఎలాంటి సాయం అందకపోవడంతో రాత్రంతా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అయితే.. ఇనుప బోర్డు రోడ్డుపై పడి ఉండడంతోనే ఈ పరిస్థితి తలెత్తినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన దృశ్యాలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఈ సమాచారం అందుకున్న పోలీసులు..ఇది ప్రమాదవశాత్తూ జరిగిందా లేదా ఉద్దేశపూర్వకంగా ఎవరైనా ఈ చర్యకు పాల్పడ్డారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఏడాది జూన్‌లో జల్నా జిల్లాలోని ఇదే హైవేపై రెండు కార్లు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఆరుగురు ప్రాణాలు కోల్పోగా.. నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ముంబయి- నాగ్‌పూర్‌ను కలుపుతూ నిర్మించిన రోడ్డు ఇది. దేశంలోని అతి పొడవైన గ్రీన్‌ఫీల్డ్‌ రోడ్‌ ప్రాజెక్ట్‌లో భాగంగా దీన్ని నిర్మించారు. రూ.55 వేల కోట్ల వ్యయంతో ఈ రహదారి నిర్మాణమైంది.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

అలా చేస్తే మీ భార్య పారిపోతుంది.. వర్క్‌-లైఫ్ బ్యాలెన్స్‌పై అదానీ కామెంట్లు

ఓర్నీ !! భక్తితో గుడికొచ్చాడనుకుంటే.. దేవుడికే ఎసరు పెట్టాడుగా..!

Daaku Maharaaj: డాకు మహరాజ్‌లో అదిరిపోయే ఫైట్స్‌.. ముందెన్నడూ చూడని విధంగా

గడ్డకట్టిన చెరువులో యువతి నిర్వాకం.. సోషల్‌ మీడియాలో వీడియో వైరల్‌

చైనాలో మరో అద్భుతం.. మరో భారీ ప్రాజెక్టును ప్రారంభం