Viral Video: అక్కడికి రాగానే వాహనాలు గాల్లోకి ఎగురుతాయి.. ఎలా.? వీడియో వైరల్..

|

Nov 02, 2024 | 7:12 PM

రోడ్డుమీద వెళ్లే వాహనాలు హఠాత్తుగా గాల్లోకి ఎగిరితే ఎలా ఉంటుంది? గాల్లో నుంచి అంతే స్పీడ్‌తో మళ్లీ భూమిని తాకితే ఇంకేమన్నా ఉందా? యస్‌.. మీరు ఊహించింది నిజమే. కానీ గుర్గావ్ లోని గోల్ఫ్ కోర్స్ రోడ్డులో మాత్రం ఓ ప్లేస్‌ దగ్గరికి రాగానే వాహనాలు గాల్లోకి ఎగురుతున్నాయి. చిన్న చిన్న వాహనాల మొదలు పెద్ద పెద్ద లారీల వరకు గాల్లోకి ఎగిరిపడుతున్నాయి.

ఓ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది విచిత్ర ఘటన అనుకుందామనుకుంటే అదేమీ కాదు. ఇంతకీ అక్కడ ఏం జరుగుతోంది.? రోడ్డు మీద అతి వేగంగా వెళ్లే వాహనాలను కంట్రోల్ చేయడానికి అక్కడక్కడా స్పీడ్ బ్రేకర్లను ఏర్పాటు చేస్తుంటారు. స్పీడ్ బ్రేకర్లు ఉన్నాయనేందుకు సూచనగా ఆ స్థలంలో పెయింట్‌తో మార్కింగ్ చేస్తారు. లేకపోతే స్పీడ్‌గా వచ్చే వాహనదారులు ఆ స్పీడ్ బ్రేకర్లను గుర్తించలేరు. దాంతో ఊహించని ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది.

గుర్గావ్‌లోని గోల్ఫ్ కోర్స్ రోడ్డులో ఎలాంటి సూచనలు, మార్కింగ్ లేకుండా ప్రధాన రహదారిపై స్పీడ్ బ్రేకర్లను ఏర్పాటు చేశారు. దీంతో ఆ రోడ్డుపై వేగంగా వస్తున్న వాహనదారులు ఆ స్పీడ్ బ్రేకర్‌ను గుర్తించలేకపోయారు. ముందుగా ఓ కారు వేగంగా వచ్చి ఆ స్పీడ్ బ్రేకర్ ఎక్కి గాల్లోకి లేచింది. కొద్ది దూరం వరకు ఎగిరి వెళ్లింది. ఆ తర్వాత వేగంగా వచ్చిన రెండు లారీలు కూడా అలాగే గాల్లోకి ఎగిరాయి. ఆ వాహనాలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ అయింది. @BunnyPunia అనే ట్విటర్ యూజర్ ఆ వీడియోను షేర్ చేశారు. ఆ వీడియో చూసిన వారు ఆశ్చర్యపోతున్నారు. ఆ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

Published on: Nov 02, 2024 07:03 PM