Vegetables Price: కూరగాయల ధరలకు రెక్కలు.. అమాంతం పెరిగిన కూరగాయల ధరలు.

|

Jun 13, 2024 | 3:43 PM

నగరంలో కూరగాయల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. దీంతో కూరగాయలు కొనాలి అంటేనే నగరవాసులు ముందు వెనుక ఆలోచన చేస్తున్నారు. గతంలో బజారుకు 200 రూపాయలను తీసుకువెళ్తే సంచి నిండా కూరగాయలు వచ్చేవి.. కానీ, ఇప్పుడు చేతినిండా డబ్బులు తీసుకెళ్లిన సంచి సగానికి కూడా కూరగాయలు రావట్లేదంటూ వాపోతున్నారు సామాన్య మధ్య తరగతి ప్రజలు.

నగరంలో కూరగాయల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. దీంతో కూరగాయలు కొనాలి అంటేనే నగరవాసులు ముందు వెనుక ఆలోచన చేస్తున్నారు. గతంలో బజారుకు 200 రూపాయలను తీసుకువెళ్తే సంచి నిండా కూరగాయలు వచ్చేవి.. కానీ, ఇప్పుడు చేతినిండా డబ్బులు తీసుకెళ్లిన సంచి సగానికి కూడా కూరగాయలు రావట్లేదంటూ వాపోతున్నారు సామాన్య మధ్య తరగతి ప్రజలు. దిగుబడి లేకపోవడం వల్లే కూరగాయల ధరలు పెరిగాయంటున్నారు రైతులు. అకాల వర్షాలు.. రబీ-ఖరీఫ్‌ అంతరంతో కూరగాయల సాగు తగ్గిపోయింది. ఇదే అదనుగా ధరలు అమాంతం పెరిగిపోతున్నాయి. ముందస్తు ప్రణాళికలు ఉన్నా ఆచరణలో విఫలం కావడంతో ప్రజల నడ్డి విరిచేలా భారం పెరుగుతోంది. మొన్నటి వరకూ వంద రూపాయలకు 6 కేజీల టమాటా దొరికేది. ఇప్పుడు రైతుబజారులోనే కిలో టమాటా రూ.50 రూపాయలు పలుకుతోంది. ఇక బీన్స్‌ రూ. 90లు దాటింది.

బీర, సొరకాయలు రూ.60కిపైగానే ఉంటున్నాయి.కిలో మిర్చి 50 రూపాలయలు, బెండకాయలు 55 రూపాయలు పైనే అమ్ముతున్నారు. కూరగాయల ధరలు అమాంతం పెరిగిపోవడంతో ఏం కొనేటట్టు లేదంటున్నారు సామాన్యులు. వర్షాకాలం కావడంతో కొత్త పంట వేయడం కూడా కూరగాయల ధరపై ప్రభావం చూపుతుందంటున్నారు. కొన్ని ప్రాంతాల్లో అధిక వర్షాలు కురవడంతో కూరగాయల దిగుబడి బాగా తగ్గిపోయిందని, వర్షాల కారణంగా పంటలు తీవ్రం గా దెబ్బతిన్నాయని తెలిపారు. ఇతర ప్రాంతాలనుంచి దిగుమతి చేసుకోవడం, ట్రాన్స్‌పోర్ట్‌ ఖర్చులు బాగా పెరిగిపోవడంతో ఆ భారం కూడా కూరగాయలపై పడుతోందని అంటున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

Follow us on