Karnataka: సెల్ఫీ మోజులో జలపాతంలో జారిపడి.. హైదరాబాద్ వాసి మృతి.
స్నేహితుడితో కలిసి సరదాగా విహారయాత్రకు వెళ్లిన ఓ హైదరాబాద్ యువకుడి కథ విషాదాంతమైంది. కర్ణాటకలోని ఓ జలపాతం వద్ద ప్రమాదవశాత్తూ నీటిలో జారిపడి అతడు ప్రాణాలు కోల్పోయాడు. స్థానిక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌కు చెందిన శ్రవణ్ ఇటీవల తన స్నేహితుడితో కలిసి చిక్కమగళూరు టూర్‌కు వచ్చాడు. వీరిద్దరూ బైక్ అద్దెకు తీసుకుని కొన్ని పర్యటక ప్రాంతాలను సందర్శించారు.
స్నేహితుడితో కలిసి సరదాగా విహారయాత్రకు వెళ్లిన ఓ హైదరాబాద్ యువకుడి కథ విషాదాంతమైంది. కర్ణాటకలోని ఓ జలపాతం వద్ద ప్రమాదవశాత్తూ నీటిలో జారిపడి అతడు ప్రాణాలు కోల్పోయాడు. స్థానిక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌కు చెందిన శ్రవణ్ ఇటీవల తన స్నేహితుడితో కలిసి చిక్కమగళూరు టూర్‌కు వచ్చాడు. వీరిద్దరూ బైక్ అద్దెకు తీసుకుని కొన్ని పర్యటక ప్రాంతాలను సందర్శించారు. సోమవారం కెమ్మనగుండిలోని హెబ్బె జలపాతం వద్దకు చేరుకున్నారు. గత కొన్ని రోజులుగా ఇక్కడ వర్షాలు కురుస్తుండటంతో జలపాతం వద్ద నీరు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ఈత రానప్పటికీ వీరిద్దరూ ఇక్కడ సెల్ఫీ కోసం ప్రయత్నించి కాలుజారి నీటిలో పడిపోయారు. గమనించిన స్థానికులు వీరిని రక్షించి బయటకు తీసుకొచ్చారు. అయితే, నీటిలో జారినప్పుడు శ్రవణ్ తలకు బండరాయి తగిలి తీవ్రంగా గాయపడ్డాడు. చికిత్స నిమిత్తం అతడిని సమీపంలోని ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. మృతుడు హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ ఈ-కామర్స్ సంస్థలో సిస్టమ్ అనలిస్ట్‌గా పనిచేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

