టీ కోసం ట్రైన్ దిగిన ప్రయాణికుడు.. పాపం.. అంతలోనే

Updated on: Nov 05, 2025 | 4:05 PM

రైల్లో దూరప్రాంతాలకు ప్రయాణిస్తున్నప్పుడు పలు స్టేషన్లలో ఆగుతూ వెళ్తుంది. ఆ సమయంలో కొందరు టీ కోసమో, నీళ్లకోసమో రైలు దిగుతూ ఉంటారు. ఒక్కోసారి రైలు చాలా సమయం స్టేషన్లో ఆగుతుంది..ఒక్కోసారి త్వరగా వెళ్లిపోతుంది. రైలు కదలడం గమనిస్తే వెంటనే రైలు ఎక్కేస్తారు.. లేదంటే ఇదిగో ఇలాంటి పరిస్థితే ఎదురవుతుంది. భారత రైల్వే ప్రయాణికులను త్వరగా గమ్యానికి చేర్చే లక్ష్యంతో వందే భారత్ రైళ్లను ప్రవేశపెట్టింది.

సాధారణంగా ప్యాసింజర్‌ ట్రైన్‌లో అయితే అది కదిలిపోతే పరుగెత్తుకెళ్లి అయినా దాన్ని ఎక్కవచ్చు. కానీ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ వంటి ట్రైన్స్‌ను స్టేషన్ నుండి బయలుదేరిన తర్వాత ఎక్కడం సాధ్యం కాదు. ఎందుకంటే ఈ ట్రైన్‌ స్టార్ట్ అయ్యే ముందే వాటి డోర్స్‌ ఆటోమేటిక్‌గా క్లోజ్ అయిపోతాయి. కాబట్టి ఏదైనా రైల్వే స్టేషన్‌లో ట్రైన్‌ ఆగిన వెంటనే ప్రయాణీకుడు దిగితే, డోర్స్‌ క్లోజ్ అయ్యేలోపు అతను ట్రైన్‌ ఎక్కాలి లేదంటే.. ట్రైన్‌ మిస్సైనట్టే.. ఎందుకంటే వందే భారత్ ఎక్స్‌ప్రెస్ వంటి రైళ్లు ఖచ్చితమైన సమయపాలన పాటిస్తాయి. ఈ విషయం తెలియక టీ కోసం ట్రైన్‌ దిగిన ఒక ప్రయాణికుడు చిక్కుల్లో పడ్డాడు. సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న వీడియో ప్రకారం.. వందేభారత్‌ ట్రైన్‌లో ప్రయాణిస్తున ఓ వ్యక్తి.. ట్రైన్‌ స్టేషన్‌లో ఆగినప్పుడు.. దిగి టీ తాగుతున్నాడు. అప్పుడే ట్రైన్‌ స్టార్ట్ అయ్యింది. అది గమనించిన ఆ వ్యక్తి తన చేతిలో రెండు టీ కప్స్‌ను పట్టుకొని ట్రైన్ ఎక్కేందుకు డోర్ దగ్గరకు వెళ్లాడు. కానీ అంతలోపే ట్రైన్ డోర్స్ క్లోజ్అయ్యాయి. అయితే ట్రైన్‌ లోపల ఉన్న వ్యక్తి.. డోర్స్‌ ఓపెన్ చేస్తాడనే ఆశతో అతను.. డోర్ వద్దే నిల్చుని ఉన్నాడు. తర్వాత అది సాధ్యం కాదని అర్థం చేసుకొని.. వెంటనే తన చేతితో ఉన్న టీ కప్స్‌ను అక్కడే పడేసి.. పరుగులు పెట్టాడు. వీడియో ఇంతటితో ముగియడంతో..అతను ట్రైన్‌ ఎక్కగలిగాడో లేదో సమాచారం లేదు. ఈ వీడియోపై నెటిజన్లు తమదైనశైలిలో కామెంట్లు చేస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ట్రక్కు నిండా కరెన్సీ నోట్లు.. ఒక్కసారిగా గాల్లోకి ఎగరేశాడు

సెలెబ్రిటీల వెంట పోకిరీల తంటా.. ఆన్‌లైన్ వేధింపులకు గురైన నటి

పాకిస్తాన్ ను వణికించే విధంగా త్రివిధ దళాల త్రిశూల్ విన్యాసాలు

తెలుగు రాష్ట్రాల్లోని దేవాలయాలలో కార్తీక శోభ

Patna: పాట్నాలో భారీగా ట్రాఫిక్ జామ్