Watch: వామ్మో ఎంతకు తెగించింది.! తిడుతున్నారని యజమానిపై వంటమనిషి ప్రతీకారం.!

Watch: వామ్మో ఎంతకు తెగించింది.! తిడుతున్నారని యజమానిపై వంటమనిషి ప్రతీకారం.!

Anil kumar poka

|

Updated on: Oct 24, 2024 | 4:26 PM

వంట చేసుకోడానికి సమయం లేకో.. ఆరోగ్యం సహకరించకో కొందరు ఇంట్లో వంటమనిషిని పెట్టుకుంటారు. వారికి కావలసిన వంట చేయించుకుంటారు. వంటబాలేదనో, మరో కారణంగానో వారిని తిడుతూ ఉంటారు. ఇదంతా బాధితులు కొన్నాళ్లు సహించినా..ప్రతీకారం తీర్చుకునే స్థాయికి చేరవచ్చు.. ఆ కుంటుంబం మొత్తాన్ని ఇబ్బందుల పాలుచేస్తారు. అందుకు ఉదాహరణే ఈ ఘటన.

చిన్న చిన్న తప్పులకే తనను తిడుతున్నారంటూ ఓ వంటమనిషి తన యజమానికి చేసే చపాతీలో మూత్రం కలిపి చపాతీలు చేసిపెట్టిన ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో చోటు చేసుకుంది. 32 ఏళ్ల రీనా అనే మహిళ స్థానిక రెసిడెన్షియల్ సొసైటీలోని ఓ వ్యాపారవేత్త ఇంటిలో గత 8 సంవత్సరాలుగా వంటమనిషిగా చేస్తోంది. అయితే, ఇన్నేళ్లుగా ఆమె చేస్తున్న పాడుపనిని ఆ కుటుంబం గుర్తించలేకపోయింది. రియల్ ఎస్టేట్ వ్యాపారి అయిన నితిన్ గుప్తా భార్య రూపమ్ గుప్తాకు అనుమానం వచ్చింది. కుటుంబ సభ్యులు అందరూ ఒకేలా కాలేయ సమస్యలతో బాధపడుతుండడంతో వారి అనుమానాలు మరింత బలపడ్డాయి. వారి అనుమానం పనిమనిషిపై పడింది. దీంతో ఇంట్లో ఏం జరుగుతుందో తెలుసుకునేందుకు కిచెన్‌లో రహస్యంగా సీసీకెమెరా అమర్చారు.

ఆ తర్వాత సీసీ ఫుటేజీ పరిశీలించగా వారి కళ్లు బైర్లు కమ్మాయి. అందరూ దిగ్భ్రాంతికి గురయ్యారు. రోటీలు తయారుచేసేందుకు వంటమనిషి పిండిలో మూత్రం కలపడం చూసి షాకయ్యారు. దీంతో ఈ వీడియోను తీసుకెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తొలుత ఈ ఆరోపణలను నిందితురాలు రీనా ఖండించింది. వీడియో చూపించాక నేరాన్ని అంగీకరించింది. అరెస్ట్ చేసిన అనంతరం ఆమెను ప్రశ్నించగా షాకింగ్ విషయాలు వెల్లడించింది. చిన్నచిన్న విషయాలకు కూడా తనను తిడుతుండడంతో ప్రతీకారం తీర్చుకునేందుకే తానీపని చేసానని నిందితురాలు వెల్లడించినట్టు పోలీసులు తెలిపారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.