US – Israel: ఆరు వారాలే యుద్ధం ఆపుతాం.! కాల్పుల విరమణ పై నెతన్యాహు..

|

Jun 06, 2024 | 8:27 PM

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ప్రతిపాదించిన కాల్పుల విరమణ ఒప్పందం అసంపూర్తిగా ఉందని ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు అన్నారు. ఆరు వారాలే యుద్ధం ఆపుతామని, శాశ్వతంగా ఆపే ప్రసక్తే లేదని తెలిపారు. సోమవారం ఆయన పార్లమెంటు విదేశీ వ్యవహారాల రక్షణ కమిటీ ముందు కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘మన షరతులను పక్కనపెట్టి కాల్పుల విరమణకు అంగీకరించామన్న వాదన సరికాదు’’ అని చెప్పారు.

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ప్రతిపాదించిన కాల్పుల విరమణ ఒప్పందం అసంపూర్తిగా ఉందని ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు అన్నారు. ఆరు వారాలే యుద్ధం ఆపుతామని, శాశ్వతంగా ఆపే ప్రసక్తే లేదని తెలిపారు. సోమవారం ఆయన పార్లమెంటు విదేశీ వ్యవహారాల రక్షణ కమిటీ ముందు కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘మన షరతులను పక్కనపెట్టి కాల్పుల విరమణకు అంగీకరించామన్న వాదన సరికాదు’’ అని చెప్పారు. హమాస్‌ అంతం కూడా కాల్పుల విరమణలో భాగమేనని తెలిపారు. యుద్ధానికి సంబంధించిన మూడు లక్ష్యాలైన హమాస్‌ నాశనం, బందీల విడుదల, భవిష్యత్తులో గాజాతో ఎలాంటి ప్రమాదం లేకపోవడం నెరవేరకపోతే యుద్ధం ఆపే ప్రసక్తే లేదని కమిటీ సభ్యులకు స్పష్టం చేశారు. బైడెన్‌ ప్రతిపాదించిన కాల్పుల విరమణ ఒప్పందం అసంపూర్తిగా ఉందని నెతన్యాహు చెప్పారు. బందీల విడుదల కోసం ఆరు వారాలే యుద్ధం ఆపుతామనీ ఆ సమయంలో చర్చలు ఉంటాయనీ అన్నారు ఇంకా చాలా వివరాలు ఉన్నాయనీ వాటిని బైడెన్‌ వెల్లడించలేదనీ చెప్పారు. ఎప్పుడైనా యుద్ధాన్ని ప్రారంభించే హక్కు మనకు ఉంటుంది అని ఆయన తెలిపారు.

మరోవైపు సెంట్రల్‌ గాజాలో ఆదివారం రాత్రి ఇజ్రాయెల్‌ జరిపిన దాడుల్లో 11 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారని పాలస్తీనా ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. గాజాలో ఇజ్రాయెల్‌ సామూహిక హత్యాకాండకు పాల్పడుతోందంటూ అంతర్జాతీయ న్యాయస్థానంలో దక్షిణాఫ్రికా దాఖలు చేసిన కేసులో భాగస్వామి అయ్యేందుకు అనుమతి కోరుతూ ‘పాలస్తీనా దేశం’ పేరిట అధికారులు దరఖాస్తు పెట్టుకున్నారు. గాజాలో ఇజ్రాయెల్‌ సామూహిక హత్యాకాండకు పాల్పడుతోందంటూ అంతర్జాతీయ న్యాయస్థానంలో దక్షిణాఫ్రికా దాఖలు చేసిన కేసులో భాగస్వామి అయ్యేందుకు అనుమతి కోరుతూ ‘పాలస్తీనా దేశం’ పేరిట అధికారులు దరఖాస్తు పెట్టుకున్నారు. హమాస్‌ చెరలో బందీలుగా ఉన్న మరో నలుగురు మృతి చెందినట్లు ఇజ్రాయెల్‌ సైన్యం సోమవారం తెలిపింది. వీరిలో ఒక వ్యక్తి మృత దేహం గాజా సరిహద్దుల్లో లభించిందని పేర్కొంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.