ప్రశాంతంగా టాయిలెట్ సీట్ మీద కూర్చున్నాడు.. ఈ లోపే బస్సుమంటూ పైకిలేచింది

Updated on: Jun 04, 2025 | 6:26 PM

ఒక ఊరిలోని టాయిలెట్‌పై నిర్మించిన ట్యాంకులో సర్పాల గుంపు కూల్‌కూల్‌గా తిష్ట వేసింది. టాయిలెట్‌పై ఉన్న ట్యాంకును శుభ్రం చేయడానికి ఇంటి యజమాని వీరేంద్ర గుప్తా వెళ్లగా, 70 పాముల గుంపు వ్యవహారం వెలుగుచూసింది. అతడిని చూడగానే పాములన్నీ కలిసి ఒక్కసారిగా బుసలు కొట్టడం మొదలుపెట్టాయి. దీంతో అరచేతిలో ప్రాణాలు పెట్టుకొని అరుస్తూ పరుగులు పెట్టాడు.

లబోదిబోమని గుండెలు బాదుకుంటూ గ్రామస్థుల సాయాన్ని కోరాడు. ఈ షాకింగ్ ఘటన ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలోని మహరాజ్‌గంజ్ జిల్లా సోనౌలీ పరిధిలోని హరది డాలీ గ్రామంలో జరిగింది. వీరేంద్ర గుప్తాకు సాయం చేయడానికి వచ్చిన గ్రామస్థులు ట్యాంకు కింద ఏకంగా 70 దాకా పాములు ఉండటాన్ని చూసి అవాక్కయ్యారు. కొద్దిసేపటిలోనే వీరేంద్ర గుప్తా ఇంటి దగ్గర పెద్దసంఖ్యలో జనం గుమిగూడారు. గ్రామస్తులు వెంటనే అటవీ శాఖకు సమాచారం అందించారు. దీంతో అటవీ శాఖ బృందం అక్కడికి చేరుకొని, చాలాసేపు కసరత్తు చేసి పాములను అన్నింటినీ రెస్క్యూ చేసింది. అనంతరం వాటిని సమీపంలోని అడవుల్లో వదిలేసింది. హరది డాలీ గ్రామం నేపాల్ సరిహద్దుకు అత్యంత చేరువలో ఉంటుంది. ఈ గ్రామం చుట్టూ దట్టమైన అడవులు ఉంటాయి. గ్రామంలో వీరేంద్ర గుప్తా ఈ ఇంటిని కొత్తగా నిర్మించారు. కొన్ని రోజుల క్రితమే దీని నిర్మాణ పనులు పూర్తయ్యాయి. టాయిలెట్‌‌పై ఉన్న నీటి ట్యాంకును కొన్ని రోజుల క్రితమే నీటితో నింపారు. ఆ నీటిని వాడలేదు. దీంతో ట్యాంకును కడుగుదామని టాయిలెట్‌పైకి ఎక్కిన వీరేంద్రకు 70 పాముల గుంపు దర్శనమిచ్చి, దడ పుట్టించింది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇన్ని పాములు ఒకచోటుకు ఎలా చేరాయి అంటూ నెటిజన్లు చర్చించుకుంటున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

బామ్మ మజాకా.. కజరారే.. పాటకు కత్తిలాంటి స్టెప్స్.. చూసిన వాళ్లకి మైండ్ బ్లాంక్

ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ జ్యూస్‌ తాగండి..ఫలితం మీరే చూడండి

వీధి శునకాలే ఆమె నేస్తాలు.. ఆకట్టుకుంటున్న చిన్నారి వీడియో