నాకు మరో భార్య కావాలి.. వాటర్‌ ట్యాంక్‌ ఎక్కి వ్యక్తి హంగామా

Updated on: Jan 09, 2026 | 9:00 AM

ఉత్తరప్రదేశ్‌లో వింత ఘటన చోటుచేసుకుంది. హర ప్రసాద్ మౌర్య అనే వ్యక్తి తనకు రెండో భార్య కావాలని 30 అడుగుల వాటర్ ట్యాంక్ ఎక్కి నిరసన తెలిపాడు. మొదటి భార్య విడిచి వెళ్లడంతో బట్టలు ఉతకడానికి, పిల్లల బాగోగులు చూడటానికి మరొకరు కావాలని డిమాండ్ చేశాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవగా, పోలీసులు నచ్చజెప్పి కిందకు దించారు. అతను మానసిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నాడని కుటుంబసభ్యులు తెలిపారు.

భార్య ఉండగానే వివాహేతర సంబంధాలు నెరపుతూ దారుణాలకు పాల్పడుతున్న ఈ రోజుల్లో ఓ వ్యక్తి తనకు రెండో భార్య కావాలంటూ నిరసనకు దిగాడు. నాకు మరో భార్యను తెచ్చిపెడతారా.. లేక చావమంటారా అంటూ వాటర్‌ ట్యాంక్‌ ఎక్కి హల్చల్‌ చేశాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఈ విచిత్ర సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని బదౌన్ జిల్లాలో జరిగింది. ఇస్లాంనగర్‌కు చెందిన హర ప్రసాద్ మౌర్య జనవరి 1న వినూత్నంగా నిరసన తెలిపాడు. స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద ఉన్న 30 అడుగుల ఎత్తైన వాటర్‌ ట్యాంకుపైకి ఎక్కి..తనకు రెండో భార్య కావాలని డిమాండ్‌ చేశాడు. ఈ ఘటనతో స్థానికులు షాకయ్యారు. వ్యక్తి హంగామాతో ఆసుపత్రి వద్ద గందరగోళం నెలకొంది. దీంతో స్థానికులు పోలీసులకు డాక్టర్‌ సమాచారం ఇచ్చారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు హర ప్రసాద్‌తో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆ వ్యక్తి…‘సార్, నేను పది రోజులుగా ఒకటే జత బట్టలు వేసుకుంటున్నా.. మురికిపట్టిపోయాయి. నా బట్టలు ఎవరు ఉతుకుతారు.. తమ భర్తబాగోగులు చూసుకోడానికి అందరికీ భార్యలు ఉన్నారు. నాకు కూడా ఒక భార్య కావాలి. నా మొదటి భార్య నన్ను విడిచిపెట్టి వెళ్లిపోయింది. మీరు నాకు రెండవ భార్యను ఇవ్వకపోతే, నేను చనిపోతా’ అంటూ తన గోడు వెల్లబోసుకున్నాడు. పోలీసులు హరప్రసాద్‌కు నచ్చజెప్పి అతడిని కిందకు దించారు. ఘటనపై హరప్రసాద్‌ తల్లిదండ్రులు స్పందిస్తూ.. తమ కుమారుడు మానసిక అనారోగ్యంతో బాధపడుతున్నాడని తెలిపారు. తమ కొడుక్కి ఎనిమిదేళ్ల కిందట వివాహం జరిగిందని, అతని భార్య భర్తను వదిలి వెళ్లిపోయిందని, వీరికి ఆరేళ్ల కుమారుడు ఉన్నాడని, అతను ప్రస్తుతం తండ్రితో ఉంటున్నాడని తెలిపారు. కాగా, పోలీసులు హర ప్రసాద్‌కు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆ తర్వాత తల్లిదండ్రులకు అతడిని అప్పగించారు. మరోసారి ఇలా జరుగకుండా చూడాలని వారికి సూచించారు. ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో నెటిజన్లు తమదైన శైలిలో స్పందించారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

తెలంగాణ విద్యార్థులు ఊపిరి పీల్చుకోండి.. సంక్రాంతి సెలవలు వచ్చేశాయి.. ఎన్ని రోజులంటే

సంక్రాంతికని సొంతూరుకు వచ్చినవారిని.. వెంటాడిన మృత్యువు

గ్యాస్ వినియోగదారులకు బిగ్ అలర్ట్.. ఆ పని చేయలేదా.. ఈ ఆఫర్ పొందలేరు

ట్రైన్ ఎక్కి యువకుడు రచ్చ రచ్చ… కట్ చేస్తే చెక్కేసిన పోలీసులు! వీడియో వైరల్

తల్లికి ఉన్న రూ.12 లక్షల అప్పును తీర్చిన టీనేజ్‌ కొడుకు