Marriage In Hospital: ఆస్పత్రిలో పెళ్లి.. ప్రేమ జంట‌కు పేషెంట్ల శుభాకాంక్షలు..

Updated on: Mar 14, 2022 | 9:56 AM

జార్ఖండ్‌లోని గొడ్డాలో షాకింగ్ ప్రేమకథ బయటపడింది. ఓ అమ్మాయి తన అక్క మరిదితో ప్రేమలో పడింది. అయితే వీరి లవ్ స్టోరీ గురించి..

జార్ఖండ్‌లోని గొడ్డాలో షాకింగ్ ప్రేమకథ బయటపడింది. ఓ అమ్మాయి తన అక్క మరిదితో ప్రేమలో పడింది. అయితే వీరి లవ్ స్టోరీ గురించి తెలిసి ఇరు కుటుంబాల్లో వీరి పెళ్లిపై చర్చ మొదలైంది. కానీ, అబ్బాయి తరపు కుటుంబం వరకట్నం డిమాండ్ చేయటంతో రెండు కుటుంబాల మధ్య దూరం ఏర్పడింది. వీటన్నింటి మధ్య ప్రేమజంట మాత్రం ఒక్కటిగానే ఉంటున్నారు..ఇంట్లో మనస్పర్థలు వచ్చినా ఇద్దరూ కలుస్తూనే ఉన్నారు. రోజుల తరబడి..ఇరుకుటుంబాల నడుమ ఏర్పడ్డ దూరాన్ని తగ్గించేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది.