Viral Video: హుండీలో మూటగా కనిపించిన పవిత్ర వస్త్రం.. ఓపెన్ చేయగా..

|

Sep 04, 2024 | 5:11 PM

ఈ ఆలయానికి ఏడాదికి ఒకసారి భక్తులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు. ఆ సమయంలో కానుకలు వెల్లువలా వస్తాయి. అయితే తొలిసారిగా గుర్తుతెలియని దాత విరాళాల పెట్టెలో లక్షల రూపాయల విలువైన బంగారాన్ని వేసిన ఘటన వెలుగులోకి వచ్చింది.

గుజరాత్‌లోని అంబాజీ మందిరానికి గుర్తు తెలియని భక్తుడు ఒక కేజీ బంగారాన్ని కానుకగా ఇచ్చాడు. పవిత్ర వస్త్రంలో చుట్టి.. రహస్యంగా కేజీ బంగారాన్ని హుండీలో వేశాడు. ఆలయ సిబ్బంది హుండీ ఓపెన్ చేయగా.. 10 బంగారు బిస్కెట్లు లభించాయి. ఒక్కో బిస్కెట్ 100 గ్రాములు ఉన్నట్లు అధికారులు తెలిపారు. రహస్యంగా అందజేసిన ఈ బంగారం విలువ దాదాపు రూ. 75 లక్షలు ఉంటుంది. మందిర్‌లోని వివిధ భాగాలకు బంగారు పూత వేయడానికి అంబాజీ ట్రస్ట్ గత కొన్ని సంవత్సరాలుగా బంగారాన్ని విరాళంగా సేకరిస్తోంది. శిఖర భాగానికి ఇప్పటికే బంగారం పూత వేశారు. బనస్కాంత జిల్లాలోని అంబాజీ ధామ్‌‌కు చాలామంది తీర్థయాత్రగా వెళ్తారు. ఏడాదిలో ఒకసారి ఇక్కడ భక్తుల రద్దీ విపరీతంగా ఉంటుంది. ఆ సమయంలోనే వెల్లువగా కానుకలు కూడా వస్తాయి.

మరిన్ని హ్యుమన్‌ ఇంట్రెస్ట్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..