Uncle Dance: వామ్మో.. ముసలాడే గానీ.. తగ్గేదే లే అంటున్న అంకుల్.. అదొక్కటే మిగిలిందంటున్న నెటిజన్లు వీడియో.

|

Jan 16, 2023 | 9:49 AM

మన దేశంలో కొత్తగా వచ్చిన ఏ పాట అయినా కొంత కాలం పాటు సోషల్ మీడియాలో ట్రెండింగ్ సాంగ్‌గా నెటిజన్లను అలరించడమనేది సర్వసాధారణంగా జరిగేదే. ఇక ఈ ట్రెండింగ్


మన దేశంలో కొత్తగా వచ్చిన ఏ పాట అయినా కొంత కాలం పాటు సోషల్ మీడియాలో ట్రెండింగ్ సాంగ్‌గా నెటిజన్లను అలరించడమనేది సర్వసాధారణంగా జరిగేదే. ఇక ఈ ట్రెండింగ్ పాటలకు యువత రీల్స్ చేయడం, తమ సోషల్ మీడియా ఖాతాలలో పోస్ట్ చేయడం కూడా మామూలే. తాజాగా ‘పత్లీ కమరియా మోరీ’ అనే భోజ్పూరీ పాట కూడా నెట్టింట వైరల్ అవుతోంది. ఈ పాటకు అనేక మంది రీల్స్ చేసి ఫేమస్ అవుతున్నారు. అదే పాటకు సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేయడమే కాక నెటిజన్లకు ఆశ్చర్యం కలిగిస్తోంది.ఈ వీడియోలో పత్లీ కమరియా మోరీ పాటకు డ్యాన్స్ వేసింది అమ్మాయిలో, అబ్బాయిలో కానే కాదు. యువకులు అసలే కాదు. దాదాపు 50 సంవత్సరాలున్న ఓ అంకుల్ రెచ్చిపోయి డాన్స్‌ చేశాడు. తన నడుమును ఊపుతూ జెర్క్స్ ఇచ్చాడు. పత్లీ కమరియా మోరీ పాట బ్యాక్‌గ్రౌండ్‌లో ప్లే అవుతుండగా, నలుగురు అమ్మాయిలతో కలిసి ఒక అబ్బాయి కిస్ చేస్తున్నట్లు అంకుల్‌కి సైగ చేశాడు. అంతే.. అంకుల్ తన జెర్క్స్‌ను చూపించాడు. ఓ యూజర్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసిన ఈ వీడియోను 24 లక్షలమందికి పైగా వీక్షించారు. 17 లక్షలమందికి పైగా లైక్‌ చేశారు. అంతేకాదు ఫన్నీ కామెంట్లతో హోరెత్తిస్తున్నారు. ఒక నెటిజన్ ‘అదొక్కటే మిగిలింది’ అని ఫన్నీగా రాస్తే, ‘అంకుల్ సన్నటి నడుమును ఏ కోణం నుంచి చూస్తున్నారు’ అని మరో నెటిజన్ కామెంట్ చేశాడు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Chiranjeevi – Pawan Kalyan: వైసీపీతో పవన్ పోరాటం చేస్తే నాకేంటి సంబంధం.. చిరంజీవి ఆసక్తికర కామెంట్స్ ..

Kantara Movie: అరెరె.. ‛కాంతార’ చిత్రంలో ఈ లాజిక్ ఎలా మిస్సయ్యారబ్బా..? వీడియో వైరల్..

Love couples: శృతిమించుతున్న యువతీ యువకులు జల్సాలు.. బైక్‌పై ప్రేమజంట వెకిలిచేష్టలు.. ట్రెండ్ అవుతున్న వీడియో.

Follow us on