సుడిగాలిలో చిక్కుకున్న బాలుడు.. కాపాడిన అంపైర్
ఫ్లోరిడాలోని ఓ మైదానంలో పిల్లలు బేస్ బాల్ మ్యాచ్ ఆడుతుండగా సుడిగాలి ఏర్పడింది. ఓ పిల్లాడు అందులో చిక్కుకుని ఉక్కిరిబిక్కిరి అయ్యాడు. దగ్గర్లోనే ఉన్న అంపైర్ వేగంగా స్పందించి, పిల్లాడిని బయటకు తీసుకొచ్చాడు. మైదానంలోని కెమెరాల్లో రికార్డైన ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ గా మారింది.
ఫ్లోరిడాలోని ఓ మైదానంలో పిల్లలు బేస్ బాల్ మ్యాచ్ ఆడుతుండగా సుడిగాలి ఏర్పడింది. ఓ పిల్లాడు అందులో చిక్కుకుని ఉక్కిరిబిక్కిరి అయ్యాడు. దగ్గర్లోనే ఉన్న అంపైర్ వేగంగా స్పందించి, పిల్లాడిని బయటకు తీసుకొచ్చాడు. మైదానంలోని కెమెరాల్లో రికార్డైన ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ గా మారింది. సమయస్ఫూర్తితో వ్యవహరించి పిల్లాడి ప్రాణాలు కాపాడావంటూ పదిహేడేళ్ల యువ అంపైర్ పై నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఏం జరిగిందంటే..జాక్సన్ విల్లేకు చెందిన జోయా ఆదివారం తన స్నేహితులతో కలిసి స్థానిక మైదానంలో బేస్ బాల్ మ్యాచ్ ఆడుతున్నాడు. ఇంతలో జోయా నిల్చున్నచోట ఉన్నట్టుండి సుడిగాలి ఏర్పడింది. వేగంగా సుడులు తిరుగుతున్న గాలి మధ్య చిక్కుకున్న జోయా ఊపిరాడక సతమతమయ్యాడు. ఆ మ్యాచ్ కు అంపైర్ గా వ్యవహరిస్తున్న ఐదాన్ విల్స్ వేగంగా వచ్చి జోయాను సుడిగాలి నుంచి బయటకు ఎత్తుకుని వచ్చాడు. దీంతో తేరుకున్న జోయా.. కాసేపటికి మళ్లీ మ్యాచ్ ఆడడంలో మునిగిపోయాడు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కొద్దిలో తప్పించుకున్నాడు కానీ.. షార్క్ నోట్లో కిళ్లీ పాన్ అయ్యేవాడు..
కుక్కలకు భయపడిన చిరుత.. ఎక్కడ దాకుందో మీరే చూడండి
వధూవరులు డ్యాన్స్ చేయాలని.. మండపంలో చితక్కొట్టేసుకున్న ఇరు కుటుంబాలు
ప్రపంచంలోని వృద్ధ శునకం !! వయసెంతో తెలుసా ??
వంద రోజుల పాటు నీటి అడుగునే నివాసం.. న్యూ రికార్డ్..
లక్ష.. లక్ష్మీకాసులతో 12 అడుగుల గణపయ్య!
రెండేళ్ల కష్టం నేడు వినాయకుడి రూపం.. పవన్‌కు గిఫ్ట్‌గా!
మర్రి ఆకుపై 2 సెం.మీ గణపయ్య.. మైక్రో ఆర్టిస్ట్ అద్భుతం!
పసుపు కొమ్ములతో పర్యావరణ గణపతి.. జడ్చర్లలో స్పెషల్ వినాయకుడు!
ఇల్లు పీకి పందిరేస్తున్నాయి పంట పొలాలు నాశనం.. పిల్లల పై దాడులు!
బరువు తగ్గాలనుకుంటున్నారా..? CMR-NIN పరిశోధనలో సంచలన నిజాలు
లీటర్‌కు రూ.80 కోట్లు.. తేలు విషం రహస్యం ఇదే!

