రూ. 100 కోట్ల లగ్జరీ ఇంటిని వీడిన కోటీశ్వరుడు..! ఎందుకంటే

Updated on: Dec 01, 2025 | 9:02 PM

బ్రిటన్‌లో 226 ఏళ్ల నాన్-డోమ్ పన్ను విధానం రద్దు కావడంతో సంపన్నులు ఆందోళన చెందుతున్నారు. యూకేలో విదేశీ ఆదాయంపై పన్ను మినహాయింపు రద్దు కాగా, ఆర్సెలార్‌ మిత్తల్‌ అధిపతి లక్ష్మీ మిట్టల్ దుబాయ్‌కి మకాం మార్చారు. పన్ను స్వర్గధామమైన దుబాయ్‌లోని నయా ఐలాండ్‌లో నివాసం ఏర్పరచుకోనున్నారు. వారసత్వ, సంపద పన్నులు లేని దుబాయ్, సంపన్నులకు కొత్త ఆశ్రయంగా మారింది.

బ్రిటన్‌లో కీర్‌స్టార్మర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నాన్‌-డోమ్ పన్ను విధానాన్ని రద్దు చేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ పన్ను విధానం కింద 226 సంవత్సరాల నుంచి యూకే నివాసితులు విదేశాల్లో సంపాదించిన ఆదాయంపై బ్రిటన్‌ ప్రభుత్వానికి ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు దానిని రద్దు చేస్తోంది. దాంతో పాటు 20 శాతం ఎగ్జిట్ ట్యాక్స్‌, మాన్షన్ ట్యాక్స్‌ విధించనుంది. వారసత్వ ఆస్తులపై 40శాతం పన్ను కొనసాగించనుంది. ఈ పన్ను సవరణలు సంపన్నులను ఆలోచనలో పడేశాయి. ఆర్సెలార్‌ మిత్తల్‌ సంస్థ ఎగ్జిక్యుటివ్‌ చైర్మన్‌ లక్ష్మీమిత్తల్‌ బ్రిటన్‌కు గుడ్‌బై చెప్పేస్తున్నారు. నాన్‌-డోమ్ పన్ను విధానాన్ని రద్దు చేయాలన్న బ్రిటన్ ప్రభుత్వ నిర్ణయంతో పన్నులకు స్వర్గధామంగా ఉండే యూఏఈకి మకాం మారుస్తున్నారని అంతర్జాతీయ మీడియా తెలిపింది. దుబాయ్‌ నగరంలోని లగ్జరీ జోన్‌కు ఆయన కుటుంబం షిఫ్ట్ కానున్నారని వార్తలు రాసాయి. సంపన్నులకు కంఫర్ట్‌గా, అత్యంత భద్రత కలిగిన ఆ జోన్‌ పేరే నయా ఐలాండ్. దుబాయ్‌లోని జుమైరా తీర ప్రాంతంలో అన్ని హంగులతో తీర్చిదిద్దిన ప్రైవేట్ ఐలాండ్ ఇది. ఇందులో పరిమిత స్థాయిలో బ్రాండెడ్ హోమ్స్‌ నిర్మించబోతున్నారు. ప్రతి ఇంటికి బీచ్ సదుపాయం ఉంది. సముద్రానికి దగ్గరగా విలాస నౌకల్లో ఎంజాయ్ చేయవచ్చు. ప్రకృతి చెంత లగ్జరీ లైఫ్‌ కోసం ప్రారంభించిన ఈ ప్రాజెక్ట్ 2029లో పూర్తికానుంది. ఈ ద్వీపంలో ఒక విల్లా ప్రారంభ ధర రూ.109కోట్ల రూపాయలు. దుబాయ్‌లో వారసత్వ పన్ను ఉండదు. అలాగే సంపన్నుల దీర్ఘకాలిక ఆస్తులపై వారికే నియంత్రణ ఉంటుంది. దుబాయ్‌లో సెటిలయ్యేందుకు సిద్ధమైన మిత్తల్‌.. బ్రిటన్‌లోని కెన్సింగ్టన్ ప్యాలెస్ లో పెట్టుబడులను మాత్రం వదులుకోవాలని అనుకోవడం లేదట. వాటివిలువ 300 మిలియన్ యూరోలు. ఆ గార్డెన్స్‌లో తాజ్ మిత్తల్ హౌస్ ప్రసిద్ధి. తాజ్‌మహల్‌, ఈ మిత్తల్‌ హౌస్‌కు వాడిన పాలరాయి ఒకే క్వారీ నుంచి తీసుకురావడం విశేషం.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

అరుదైన ఈ పువ్వును మీరు ఎప్పుడూ చూసి ఉండరు!

వాష్‌రూమ్‌లో నుంచి భారీ శబ్ధం.. వెళ్లి చూస్తే..అమ్మబాబోయ్‌..

ట్రూ-కాలర్ కాదు.. అంతకు మించి.. ప్రయోజనాలు తెలిస్తే మైండ్ బ్లాకే

వీరికి సీతాఫలం విషంతో సమానం.. హెచ్చరిస్తున్న వైద్యులు

డెడ్‌బాడీకి అంత్యక్రియలు.. అనుమానంతో చెక్‌చేసిన కాటికాపరి షాక్‌