5

ఖరీదైన ఐఫోన్‌ ఆర్డర్‌ చేశాడు !! పార్శిల్‌ను చూసి ఖంగుతిన్నాడు !! వీడియో

ఇటీవల ఆన్‌లైన్‌ మోసాలు సర్వసాధారణమైపోయాయి. ముఖ్యంగా ఆన్‌లైన్‌ షాపింగ్‌లో ఖరీదైన వస్తువుల కోసం ఆర్డర్‌ చేసినప్పుడు వాటి స్థానంలో సబ్బులు, చాక్లెట్స్‌, మరికొన్ని చోట్ల ఖాళీ బాక్స్‌లు రావడం మనం చూస్తూనే ఉన్నాం.

|

Updated on: Jan 17, 2022 | 9:37 AM

ఇటీవల ఆన్‌లైన్‌ మోసాలు సర్వసాధారణమైపోయాయి. ముఖ్యంగా ఆన్‌లైన్‌ షాపింగ్‌లో ఖరీదైన వస్తువుల కోసం ఆర్డర్‌ చేసినప్పుడు వాటి స్థానంలో సబ్బులు, చాక్లెట్స్‌, మరికొన్ని చోట్ల ఖాళీ బాక్స్‌లు రావడం మనం చూస్తూనే ఉన్నాం. వీటి గురించి సదరు కంపెనీలు వివరణలు ఇస్తున్నా ఆన్‌లైన్‌ మోసాలు ఆగడం లేదు. తాజాగా యూకేకు చెందిన ఓ వ్యక్తికి ఇలాంటి అనుభవమే ఎదురైంది. ఎంతో ఇష్టంగా ఐఫోన్‌ ఆర్డర్‌ చేస్తే టిష్యూ పేపర్‌లో చుట్టిన రెండు ఓరియో క్యాడ్‌బరీ చాక్లెట్ల పార్శిల్‌ ప్యాక్‌లో వచ్చాయి. దీంతో సదరు వినియోగదారుడు లబోదిబోమన్నాడు. యూకేకు చెందిన డానియెల్‌ కారోల్‌ దాదాపు లక్షా 5 వేల విలువైన ఐఫోన్‌ 13 ప్రో మ్యాక్స్‌ను ఆర్డర్‌ చేశాడు. డిసెంబర్‌ 2న యాపిల్‌ అధికారిక వెబ్‌సైట్లో ఆర్డర్‌ చేసిన అతనికి డిసెంబర్‌ 17న డెలివరీ ​అందాల్సి ఉంది. కానీ ఆర్డర్‌ రావల్సిన తేదీకి రెండు వారాలు ఆలస్యంగా పార్శిల్‌ వచ్చింది.

మరిన్ని ఇక్కడ చూడండి:

Viral Video: గర్ల్‌ఫ్రెండే కదా అని సీక్రెట్స్‌ అన్నీ చెప్పేశాడు !! చివరికి ?? వీడియో

Follow us