Snakes Dancing: విశాఖ ఏజెన్సీలో ఒళ్లు గగుర్పొడిచే ఘటన.. రెండు గంటల పాటు పాముల సయ్యాట..!
విశాఖ ఏజెన్సీలో రెండు పాముల సయ్యాట కెమెరాకు చిక్కింది. రెండు పాముల సయ్యాటకు సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Two Snakes Dancing in AP: విశాఖ ఏజెన్సీలో రెండు పాముల సయ్యాట కెమెరాకు చిక్కింది. రెండు పాముల సయ్యాటకు సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఒకదానిపై మరొకటి పైచేయి సాధించేందుకు అవి చేస్తున్న విన్యాసాలు ఒళ్లు గగుర్పొడిచేలా ఉన్నా వీడియో ఆందర్నీ ఆకర్షిస్తోంది. పాడేరు సినిమా హాల్ సెంటర్ వీధిలో రెండు పాముల సయ్యాటను స్థానికులు చిత్రీకరించారు. దాదాపు రెండు పాములు రెండు గంటల పాటు సయ్యాటలాడాయి. దారిలో వెళ్లేవారు ఆ దృశ్యాలను తీక్షణంగా చూశారు. కొంతమంది పాముల సయ్యాటను మొబైల్ ఫోన్లలో బంధించారు. సుమారు రెండు గంటల పాటు సర్పాలు మెలికలు తిరుగుతూ చేసిన సయ్యాటలను చూపరులు ఆసక్తిగా తిలకించారు.
Published on: May 26, 2021 05:32 PM
వైరల్ వీడియోలు
Latest Videos