వాగులో చిక్కుకున్న కారు.. చెట్టు కొమ్మను పట్టుకుని వేలాడుతూ భార్య భర్తలు

|

Oct 11, 2022 | 9:39 AM

వర్షాకాలం సీజన్‌ పూర్తైంది. అయినా వరుణుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. కుండపోత వర్షాలతో జనజీవనాన్ని అతలాకుతలం చేస్తున్నాడు. తెలంగాణ అంతటా అక్టోబర్‌ 5న కుండపోత వర్షం కురిసింది.

వర్షాకాలం సీజన్‌ పూర్తైంది. అయినా వరుణుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. కుండపోత వర్షాలతో జనజీవనాన్ని అతలాకుతలం చేస్తున్నాడు. తెలంగాణ అంతటా అక్టోబర్‌ 5న కుండపోత వర్షం కురిసింది. భారీ వర్షానికి వికారాబాద్‌ జిల్లాలోని వాగులు, వంకలు పొంగిపోర్లుతున్నాయి. ఉప్పొంగి ప్రవహిస్తున్న వాగులతో ప్రజలు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులుపడ్డారు. జిల్లావ్యాప్తంగా పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. జిల్లాలోని థరూర్ మండలం నాగారం వద్ద వరద ఉధృతికి వాగులో కారు చిక్కుకుంది. కారులోని ప్రయాణీకులు చెట్టు కొమ్మను పట్టుకుని ప్రాణాలు కాపాడుకున్నారు. దారూర్ మండలం నాగారం గ్రామం వద్ద వాగులో శివ, లాస్య అనే దంపతులు ప్రయాణిస్తున్న కారు కొట్టుకుపోయింది. అదృష్టవశాత్తు ఆ భార్యభర్తలిద్దరూ చెట్టు కొమ్మను పట్టుకుని ప్రమాదం నుంచి బయటపడ్డారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Naga Chaitanya: నాగచైతన్య సినిమాకు షాకిచ్చిన ప్రభుత్వం

ఒక్క ట్వీట్‌తో.. నయన్‌ ఫ్యాన్స్‌కు చెక్‌.. కస్తూరీ అంటే అట్లుంటది మరీ !!

Nayanthara: తల్లి అవడం ఏమో కాని.. పెద్ద రచ్చకు కేరాఫ్‌ అయింది

Published on: Oct 11, 2022 09:39 AM