పొదల్లో వింత శబ్ధాలు.. ఏమిటా అని పరిశీలించిన స్థానికులకు షాక్‌

Updated on: Apr 12, 2025 | 12:08 PM

తమ ప్రేమను పండించుకుంటూ.. విరహవేదన నుంచి విముక్తి పొందుతూ ఓ పాముల జంట స్థానికులను కట్టిపడేసింది. సాయం సంధ్యవేళ పొదల్లో పెనవేసుకున్న పాముల సయ్యాటను కొందరు తమ మొబైల్స్‌లో చిత్రీకరించారు. ప్రస్తుతం ఈ జంటపాముల సయ్యాట నెట్టింట వైరల్‌ అవుతోంది. తిరుపతి జిల్లా కేవీబీపురం మండలం కలత్తూరు గ్రామంలో సాయం సంధ్యవేళ పొదల్లో రెండు పాములు పెనవేసుకున్నాయి.

దాదాపు 15 అడుగుల పొడవున్న రెండు పాములు చుట్టూ పరిసరాలను మరిచిపోయి సుమారు గంటన్నరపాటు సయ్యాటలో మునిగితేలాయి. పొదల్లో అలికిడి విని ఏమై ఉంటుందా అని పరిశీలించిన స్థానికులకు ఈ అద్భుత దృశ్యం కనిపించింది. విషయం చుట్టుపక్కల అందరికీ తెలియడంతో అక్కడికి జనం గుమిగూడారు. ఆ పాముల సయ్యాటను వింతగా చూస్తుండిపోయారు. మరికొందరు ఇలా నాగుపాముల సయ్యాటను చూడటం శుభప్రదమని నమస్కారం చేసుకున్నారు. ఇలా సర్పాల సయ్యాటలాడిన ప్రాంతంలో పూజలు చేస్తే.. సంతానం లేనివారికి సంతానం కలుగుతుందని నమ్ముతారు. అక్కడ తెల్లని వస్త్రాన్ని కూడా సమర్పిస్తారు. కొందరు ఈ రియల్‌ స్నేక్‌ డ్యాన్స్‌ను తమ మొబైల్స్‌లో చిత్రీకరించి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. ఈ వీడియో నెటిజన్లను సైతం కట్టిపడేస్తుంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

అక్కడ భారీగా బంగారం నిల్వలు.. పసిడి ధరలు పడిపోతాయా?