TV9 Ismart News: ఆవుకు గ్రాండ్ గా బర్త్ డే సెలెబ్రేషన్ | చాయ్ లవర్స్‌కు బ్యాడ్ న్యూస్.

|

Aug 14, 2024 | 2:20 PM

యాపీ బార్త్ డే టూయూ.. యాపీ బార్త్ డే టూయూ.. యాపీ బార్త్ డే టూయూ.. డియర్ లచ్చిమీ.. యాపీ బార్త్ డే.. టూ.. యూ.. (క్లాప్స్).. అబ్బ.. ఇప్పటిదంక మస్తు బర్తుడేఉ సూశ్నా.. నేనుగూడ చేస్కున్న.. కనిగొ.. గిసంటి ఎరైటీ బర్తుడేనైతె ఎన్నడు సూడలే.. పార్రి ఏందో ఆ ఎరైటీ.. మీరుగూడ సూద్దురుగని.. స్పాట్.. ఆవును చూపెట్టు.. స్టార్టింగ్ లో దండ వేయకముందు.. ఆ ఎవల్దో బర్తుడే అన్నరు.. గీ ఆవును సూపెడ్తున్నరేంది అనుకుంటుర్రులే.. మరదే..

ఆర్టీసీ బస్సులో ప్రయాణం సురక్షితం.. ప్రైవేట్ వద్దు, ఆర్టీసీ ముద్దు.. అనిగిట్ల ఆర్టీసీ బస్సుల ప్రయాణం కడ్తె ఎంత బిందాస్గ ఉండచ్చో చెప్తుంటరు ఆర్టసోల్లు.. కని గాశారం బాగలేకుంటె అర్టిపండు తిన్నా పన్నురుగుతదన్నట్టు.. టైం బ్యాడైతె ఏ బస్సెక్కినా సేఫ్టీ ఉండది.. ఇగొ.. బెంగుళూర్ల గదే కతైంది.

యాపీ బార్త్ డే టూయూ.. యాపీ బార్త్ డే టూయూ.. యాపీ బార్త్ డే టూయూ.. డియర్ లచ్చిమీ.. యాపీ బార్త్ డే.. టూ.. యూ.. (క్లాప్స్).. అబ్బ.. ఇప్పటిదంక మస్తు బర్తుడేఉ సూశ్నా.. నేనుగూడ చేస్కున్న.. కనిగొ.. గిసంటి ఎరైటీ బర్తుడేనైతె ఎన్నడు సూడలే.. పార్రి ఏందో ఆ ఎరైటీ.. మీరుగూడ సూద్దురుగని..

చాయ కప్పు సిప్పు వేసి పక్కకు పెట్టి ) అబ్బ ఎవ్వలేమన్న చెప్పనియిర్రి. చాయ తాగక పోతే ఆ రోజంత ఏదో ఎల్తి ఉంటది. పొద్దుగాల లెవ్వంగనే బంగారమిస్త అన్న అద్దంటరు.. ముత్తెమంత చాయుంట సాలునుకునేటోల్లు శానమందే ఉంటరు. ఓపూట అన్నం తినకుంట ఉంటరు గింత చాబొట్టు కడ్పులేయ్యకుంటనైతే ఎవ్వలుండరు. ఏం చేస్తం అది మన బలహీనత అంటరు శాయ తాగేటోల్లైతే.. అసోంటి చాయ లవర్సుకు షాకిచ్చిండ్రు హైద్రవాద్ల చాయ దంద చేషేటోల్లు అదెట్ల ఏం కథన్నది సూడుర్రి మరీ

ఏందో మరీ వానలు పడ్డట్టే చేస్తున్నయి..మల్ల అల్గవోయిన అల్లుని లెక్క అటే పోతున్నయి. పట్నంలనైతే జెర రొండోద్దులు అట్ల బట్ట తడ్పు మందం పడ్డది..మబ్బులొచ్చినట్టే వొ్చ్చి ఊరిచ్చుడు అటెంక ఉఫ్ అనిపిచ్చుడు గిదే కతైతున్ది. ఇగీడి సంగతిట్లుంటే బైట జిల్లాల పొంటి వడ్డ వానలు కూడ వాపస్ పోయినట్టే అన్పిస్తుంది. మొన్నటి దాక తెర్రవెట్టిన శ్రీశైలం డ్యాం గేట్లు కూడ బందు పెట్టిండ్రు.. ఇదే మోకా అని సుట్టు ముట్టు ఊరోల్లు తెప్పలేస్కోని శాపల కో్సం చీమల దండు కద్లినట్టు ఎట్ల కదిలిండ్రో సూడుర్రిగ

‘ఇల్లు కట్టతందుకు సిమెంట్ కొల్వు చేశ్నోల్లకు రిటైర్మెంట్ తప్పది. దిగిపోయినోల్లకు తోటోల్లంత ఆఖరి రోజు నాడు మస్తు సన్మాన సత్కార్యాలు చేస్తరు.. దావతిస్తరు. కొందర్నైతే బండ్లు ఎక్కిచ్చి దాన్ని లాక్కూంట పోతరు. ఇట్ల ఎవ్వలి తీర్ల ఆల్లు మర్యాదలు చేషి ఇంటికి సాగదోల్తరు. ఎట్లైతే మనమంత దిగిపోయిన మనోల్లకు సన్మానాలు చేస్తమో..పోలీసోల్లు కూడ ఆల్లకు సాయమైన శునకాలకు కూడ గట్లనే రిటైర్మెంట్ కార్యం చేషి దాని సేవలను కోనియాడుకుంటరు.. వరంగల్ల కొల్వులకెల్లి రిటేరైన ఓ శునకానికి కూడ బందవస్తుగ సన్మానం చేషిండ్రట..

దేశానికి సేవజేశే ఆర్మీ జవాన్లంటె, దేశ ప్రధాని, రాష్టపతి కాడికేలి కామన్ పబ్లిక్ దంక.. ప్రతొక్కలు మస్తు ఇల్విస్తరు.. కన్నతల్లిని, కట్టుకున్నోల్లను, కన్నపిల్లలను, ఉన్న ఊరిని ఇడ్శిపెట్టి, ఎక్కన్నో బాడర్ల ఎండకు, వానలకు, సలికి తట్టుకోని దేశానికి కావలి కాస్తుంటరు వాళ్లు. అందుకే జై జవాన్ అని వాళ్ల సేవలకు సెల్యూట్ కొడ్తమంత.. కని అందరి లెక్క వేరే.. గా రాజస్థాన్ జైపూర్ పోలీసోల్ల లెక్క వేరే ఉంది.. ఆర్మీ జవాన్ల అయ్యలసంటోల్లం మేం.. అని ఒక జవాన్ను ఎంత ఆగంబట్టిచ్చిర్రో తెలిస్తె.. హవ్వ వాళ్లేం పోలీసోల్ర అయ్య ..అంటరుగావచ్చు.

యే.. అంత తూచ్.. ఈ పోలీసోల్ల పద్దతస్సలు బాగలే.. అరె.. థింక్ షార్ప్ అన్నట్టు.. తీరొక్క వేరియేషన్ ఐడియాలతోని స్మగ్లింగ్ చేస్తున్నా కొద్ది వొట్టిగనే దొర్కవడ్తున్నరు. అసల్ గంజాయ్ స్మగ్లర్లకు తెల్వకుంట, సప్లయ్ చేశేకాన్నే ఇన్ఫార్మర్లను వెట్కున్నరా ఎట్ల? లేకుంటె గింత జబర్దస్త ఐడియా ఏశినా ఎట్ల దొర్కవడ్తరుమరి? ఇగొ..

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.