తాబేళ్ల రౌండ్ టేబుల్ సమావేశం చూసారా?

Updated on: Aug 27, 2025 | 7:30 AM

సోషల్ మీడియాలో జంతువులకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతుంటాయి. జంతువులు మనుషులను అనుకరిస్తూ చేసే పనులు చూసినప్పుడు ఆశ్చర్యం వేస్తుంది. తాజాగా, అలాంటి వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. సరస్సు అడుగున కొన్ని తాబేళ్లు పెట్టుకున్న రౌండ్‌ టేబుల్‌ సమావేశం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. వైరల్ అవుతున్న ఈ వీడియోను చూసి అంతా ఆశ్చర్యపోతున్నారు.

ఓ సరస్సు అడుగున కొన్ని తాబేళ్లు గుండ్రటి వలయాకారంలో సమావేశమయ్యాయి. వాటన్నిటికి నాయకులుగా మధ్యలో నిలబడిన తాబేళ్లు ఏవో సూచనలు చేస్తున్నాయి. మిగతావి సూచనలు శ్రద్ధగా వింటున్నట్లుగా కనిపించాయి. అద్భుతంగా ఉన్న ఆ దృశ్యం చూసి నెటిజన్లను ఆశ్చర్యానికి గురిచేసింది. మనుషుల మాదిరిగానే తాబేళ్లు కూడా రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహిస్తాయా అని చాలా మంది ఆశ్చర్యం వ్యక్తం చేసారు. ఈ ఘటనను ఓ వ్యక్తి కెమెరాలో బంధించి ఎక్స్‌లో పోస్ట్ చేయగా ఆ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. దీంతో నెట్టింట తాబేళ్ల జీవన విధానంపై చర్చ మొదలైంది. వీడియోను ఇప్పటివరకు కోటి మందికి పైగా వీక్షించారు. చాలా ముఖ్యమైన సమావేశం ఏదో జరుగుతున్నట్లు కనిపిస్తోందని ఒకరు అది తాబేళ్లు గుడ్లు పెట్టే సమయని మరొకరు ప్రకృతిలో వింతలు విడ్డూరాలు ఎన్నో ఉన్నా అవేవీ పట్టించుకోకుండా మనిషి తన స్వార్థం కోసం వాటిని నాశనం చేస్తున్నాడనీ ఇంకొందరు వాదించారు. ఇలాంటి వీడియోలు మనకు ప్రకృతి వైవిధ్యాన్ని అర్థం చేసుకోవడంలో సహాయపడతాయని మరికొందరు పోస్ట్‌ పెట్టారు.

మరిన్ని వీడియోల కోసం :

ఖైరతాబాద్‌ గణపతిని చూశారా?వీడియో

తాత నువ్వు కేక.! ఇలా కూడా వ్యాపారం చేయొచ్చా?వీడియో

కొడుకు ప్రాణాల కోసం.. మొసలితో తల్లి ఫైటింగ్‌ వీడియో