Viral Video: అమ్మ బాబోయ్.. పామును అమాంతం మింగేసిన తాబేలు.. వీడియో చూస్తే షాకే

Updated on: May 06, 2025 | 2:30 PM

వైరల్ అవుతున్న వీడియోలో ఓ నదిలో రాయి కింద పెద్ద తాబేలు నక్కి ఉంది. దానికి సమీపంలోని మరో రాయి వద్ద పాము ఉంది. తాబేళ్ల సాధారణంగా పామును తిన్న దాఖలాలు లేవు. కానీ ఈ తాబేలు ఎంత ఆకలితో ఉందో ఏమో.. ఆ పామును సెకన్ల వ్యవధిలో.. సమీపించి.. ఒక్కసారిగా గబుక్కున నోటితో అందుకుంది. ఈ షాకింగ్ దృశ్యాలను సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

తాబేలు ఉభయచర జీవి మనకు తెలుసు. అంటే అది నీటిలోనూ, నేలపైన జీవించగలదు. వాటి లైఫ్ స్పాన్ 40 నుంచి 50 ఏళ్లు అని వెటర్నరీ నిపుణులు చెబుతున్నారు. కొన్ని ఇంకా ఎక్కువ ఏళ్లు కూడా బ్రతుకుతాయని అంటుంటారు.  ఇక తాబేలు ఫుడ్ అలవాట్లు సైతం భిన్నంగా ఉంటాయి. మొక్కలు, వివిధ రకాల ఆకులు, క్యారెట్లు, బెర్రీస్, యాపిల్స్, చిన్న చిన్న కీటకాలు, వానపాములు, చేపలు వంటి వాటిని తింటుంటాయి. అయితే తాబేలు ఆహారం తింటున్న వీడియోలు చాలా తక్కువగా సోషల్ మీడియాలో అందుబాటులో ఉన్నాయి. కాగా తాబేలు పామును తినడం మీరెప్పుడైనా చూశారా..?. ఈ వీడియో చూస్తే మీకు దిమ్మతిరగాల్సిందే. అత్యంత నెమ్మదిగా కదిలే తాబేలు.. అతి వేగంగా కదిలే పామును తినేసింది.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..