Telangana: వామ్మో.. ఎంత పే..ద్ద వాహనమో.. పరిగి దాటేందుకు 2 రోజులు పట్టింది..
పెద్ద లారీ... ట్రాన్స్‌ఫార్మర్‌ను పూణే నుంచి చెన్నైకు తీసుకెళ్తుంది. అంత పెద్ద వాహనం కావడంతో.. చాలా అవాంతరాలు ఎదురవుతున్నాయి. పరిగి పట్టణం దాటేందుకే ఈ వాహనానికి 2 రోజులు పట్టిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. పూర్తి డీటేల్స్ తెలుసుకుందాం పదండి ..
వికారాబాద్ జిల్లా పరిగి మీదుగా భారీ వాహనం వెళ్లడం స్థానికులను ఆశ్చర్య పరిచింది. అతి పెద్ద ట్రాన్స్‌ఫార్మర్‌ను రవాణా చేస్తున్న భారీ వాహనం పరిగి పట్టణం దాటేందుకు రెండు రోజుల సమయం పట్టింది. పూణే నుంచి బయలుదేరిన ఈ వాహనం పరిగి చేరేందుకు మూడు నెలలు పట్టిందని.. చెన్నై చేరేందుకు మరో మూడు నెలలు పట్టోచ్చని రవాణా సిబ్బంది తెలిపారు. పట్టణాలు దాటేటప్పుడు కరెంట్ పోల్స్, నేమ్ బోర్డులు, విద్యుత్ లైన్స్ అడ్డుగా వస్తే రోజుల తరబడి వేచి ఉండాల్సి వస్తుందని అన్నారు. జాతీయ రహదారి 163 పై నేమ్ బోర్డ్ అడ్డుగా మారడంతో దాన్ని తొలగించి పరిగి దాటేందుకు రెండు రోజుల సమయం పట్టింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Published on: May 05, 2025 03:50 PM
వైరల్ వీడియోలు
పొలం దున్నుతుండగా నాగలికి తగిలిన రాయి.. తీసి చూడగా..!
మీ ఇంటికే మేడారం ప్రసాదం.. ఆర్టీసీ కొత్త ఆఫర్
పల్లె పడతులు వర్సెస్ పట్నం భామలు..సై అంటే సై..!
ఒడిశా గుహల్లో వెలుగుచూసిన ఆదిమానవుల ఆనవాళ్లు
వాషింగ్ మెషిన్ బ్లాస్ట్.. అసలు ఇది ఎలా జరిగిందంటే?
కదిలే కారులోకి దూసుకొచ్చిన అడవి మృగం..తల్లి ఒడిలోని చిన్నారి మృతి
600 ఏళ్ల నాటి వినాయక విగ్రహం లభ్యం

