TSRTC: టీఎస్ఆర్టీసీ వినూత్న ఆలోచన.. రైల్వే స్టేషన్ నుంచి బస్టాప్‌లకు ఉచిత వాహనాలు..

|

May 29, 2022 | 9:14 AM

విజయపథంలో దూసుకుపోవడమే లక్ష్యంగా టీఎస్‌ ఆర్టీసీ కొత్త కొత్త స్కీములతో ప్రయాణికులను ఆకట్టుకుంటోంది. తాజాగా తెలంగాణ ఆర్టీసీ వినూత్న ఆలోచనతో ముందుకొచ్చింది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి


విజయపథంలో దూసుకుపోవడమే లక్ష్యంగా టీఎస్‌ ఆర్టీసీ కొత్త కొత్త స్కీములతో ప్రయాణికులను ఆకట్టుకుంటోంది. తాజాగా తెలంగాణ ఆర్టీసీ వినూత్న ఆలోచనతో ముందుకొచ్చింది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి సమీపంలోని బస్టాప్‌లకు ప్రయాణికులను ఉచితంగా చేరవేసేందుకు ఎలక్ట్రిక్ వాహనాలను అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించింది. అల్ఫా హోటల్, రెతిఫైల్ బస్టాండ్, బ్లూసీ హోటల్ ఎదురుగా ఉండే ఉప్పల్ బస్టాప్, మెట్టుగూడ, చిలకలగూడ, గాంధీ ఆసుపత్రివైపు వెళ్లేందుకు వీలుగా ఏర్పాట్లు చేస్తున్నారు.ఎలక్ట్రిక్ వాహనాలకు సంబంధించిన ఈ సమాచారాన్ని రైల్వే స్టేషన్‌లో ఇరువైపులా ఉన్న ప్లాట్‌ఫామ్స్‌పై ఆర్టీసీ ఏర్పాటు చేయనుంది. ప్రయాణికులు రైలు దిగగానే వాటి వద్దకు వెళ్లి ఎక్కడికి వెళ్లాలో చెబితే బ్యాటరీ వాహనాలు రప్పిస్తారు. అక్కడి నుంచి సమీపంలోని బస్టాప్‌లో వదిలిపెడతారు. మెట్రో రైలులో వెళ్లాలనుకునేవారు విషయం చెబితే అక్కడే దిగబెడతారు. మరోవారం పది రోజుల్లోనే ఈ ఉచిత వాహన సేవలు అందుబాటులోకి రానున్నట్టు ఆర్టీసీ అధికారులు తెలిపారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Google Search: ఈ 3 విషయాలు గూగుల్‌లో సెర్చ్‌ చేయకండి.. చేస్తే జైలుకెళ్లడం కన్ఫమ్‌..!

Ratlam Temple: ఆ గుడికి వెళ్తే.. బంగారం ఫ్రీ..! భక్తులకు ప్రసాదంగా బంగారు, వెండి నాణాలు.. ఎక్కడంటే.?

Child cooking: ఈ బుడ్డోడు గరిటపడితే బాల భీముడే.. బుడతడి వంటకు నెటిజన్లు ఫిదా..!

Published on: May 29, 2022 09:14 AM