Viral Video: జింక తెలివికి హ్యాట్సాఫ్.. ఎస్కలేటర్ ఎక్కి మరీ ఎక్కడికి వెళ్లిందో తెలుసా? వైరలవుతోన్న వీడియో

|

Nov 17, 2021 | 4:22 PM

Trending Video: దురదృష్టవశాత్తు ఓ జింకకు గాయాలయ్యాయి. అయితే అది చేసిన పని ప్రస్తుతం నెట్టింట్లో తెగ వైరలవుతోంది.

Viral Video: జింక తెలివికి హ్యాట్సాఫ్.. ఎస్కలేటర్ ఎక్కి మరీ ఎక్కడికి వెళ్లిందో తెలుసా? వైరలవుతోన్న వీడియో
Deer Viral Video
Follow us on

Trending Video: దురదృష్టవశాత్తు మనకు ఏదైనా గాయమైతే వెంటనే హాస్పిటల్‌కు వెళ్తాం. అది అందరికీ తెలిసిందే. కానీ, నెట్టింట్లో తెగ వైరలవుతోన్న ఓ వీడియోలో జింక కూడా అచ్చం మనుషుల్లాగే ఆలోచించిందో ఏంటో.. గాయాలతో ఏకంగా డాక్టర్ల వద్దకు చేరి వార్తల్లో నిలిచింది. అది కూడా ఓ పెద్ద ఆసుపత్రికి చేరి మరీ నెటిజన్లను ఆకట్టుకుంది. గాయపడిన జింక యునైటెడ్ స్టేట్స్‌లోని లూసియానాలోని ఒక ఆసుపత్రి ముందు తలుపు గుండా పరిగెత్తింది. అయితే హాస్పిటల్ సిబ్బంది బంధించే ముందు ఎస్కలేటర్‌ పైకి ఎక్కి మరీ ప్రయాణించింది.

ఆన్‌లైన్‌లో వైరలవుతోన్న ఈ వీడియోలో ఆ జింక చేసిన హాడావుడిని మనం చూడొచ్చు. ఓపెన్ డోర్ ద్వారా ఎంట్రీ ఇచ్చిన జింక.. ఫ్లోర్ స్మూత్‌గా ఉండడంతో జారి కిందపడుతూ ఎలాగోలా రెండవ అంతస్తులోకి ఎస్కలేటర్‌ ఎక్కి వెళ్లింది. జింక చేస్తున్న హాడావుడిని చూసిన సిబ్బంది, సందర్శకులు ఆశ్చర్యపోయారు.

“మా సిబ్బంది ఎప్పుడూ ఊహించని వాటికి సిద్ధంగా ఉంటారు” అని ఆసుపత్రి ఒక ప్రకటనలో తెలపడం విశేషం. జింక రెండో అంతస్తుకు చేరిన తర్వాత లా ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారితో సహా పలువురు వ్యక్తులు దానిని పట్టుకుని కిందకి దించారు. అనంతరం లూసియానా వైల్డ్‌లైఫ్ అండ్ ఫిషరీస్ డిపార్ట్‌మెంట్‌కు అందించారు.

“మా టీమ్ సభ్యులు ఎప్పుడూ ఊహించని వాటికి సిద్ధంగా ఉంటారు. లూసియానా వన్యప్రాణి, మత్స్య శాఖ వెంటనే స్పందించి జంతువును పట్టుకోవడంలో సహాయం చేశారు. పేషెంట్ కేర్‌కు అంతరాయం కలగలేదు. ఆ ప్రాంతాన్ని పూర్తిగా శానిటైజ్ చేస్తున్నారు” అని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. అయితే సమీపంలోని వార్డ్ క్రీక్ నుంచి ఆసుపత్రికి వెళ్లే ముందు జింకను ఓ కారు ఢీకొట్టిందని వన్యప్రాణుల అధికారులు అంటున్నారు.

దురదృష్టవశాత్తు గాయాలతో జింక మరణించినట్లు తెలుస్తోంది. గతేడాది జరిగిన ఓ ప్రమాదంలో మాత్రం జింకను రక్షించినట్లు అధికారులు తెలిపారు. కాన్సాస్‌లోని అగ్నిమాపక సిబ్బంది ఎడ్జెర్టన్ పట్టణంలో గడ్డకట్టిన సరస్సు నుంచి ఒక జింకను రక్షించారు. ఒడ్డు నుంచి 50 అడుగుల దూరంలో ఉన్న గడ్డ కట్టిన మంచులోనే జింక దాదాపు 20 నిమిషాలకు పైగా ఉందని వారు తెలిపారు.

Also Read: Viral Video: పేరుకే బుడ్డోడు.. బౌలింగ్‌లో మాత్రం కాదు.. తన స్పిన్‌‌తో బ్యాట్స్‌మెన్‌ను ఎలా భయపెట్టాడో చూడండి..!

Viral Video: కోడికి కోపం వ‌స్తే ఇలాగే ఉంటుంది మరీ!.. బట్టలూడదీసేంత పని చేసేసింది బాబోయ్..