Viral Video: క్రికెట్‌లో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. టీ20 వచ్చాక క్రికెట్ పూర్తిగా మారిపోయింది. ఇందులో అభిమానులకు మాత్రం ఫుల్ జోష్ దొరుకుతుంది. అయితే ఇందులో కొందరు ఆటగాళ్లు చేసే మూమెంట్స్‌తో నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంటారు. ఇలాంటిదే తాజాగా ఓ వీడియో నెట్టింట్లో వైరలవుతోంది. ఆస్ట్రేలియాలో జరుగుతున్న మార్ష్ కప్ టోర్నమెంట్‌లో జరిగిన ఓ సీన్ నెట్టింట్లో నవ్వులు పూయిస్తుంది. ఈ టోర్నమెంట్‌లో భాగంగా బుధవారం దక్షిణ ఆస్ట్రేలియా, క్వీన్స్‌ల్యాండ్ మధ్య ఓ మ్యాచ్ జరిగింది.
ఈ మ్యాచ్ లో క్వీన్స్‌ల్యాండ్ ఇన్నింగ్స్ 36 వ ఓవర్‌లో బ్యాట్స్‌మెన్ మైఖేల్ నాసర్ ఓ భారీ షాట్‌కు ప్రయత్నించాడు. కానీ, అది మిస్ అయ్యి బాల్ గాల్లోకి లేచింది. ఈ క్యాచ్‌ను పట్టేందుకు ముగ్గురు ఫీల్డర్స్ పరిగెత్తారు. ఇందులో ఓ ఫీల్డర్ ఆ క్యాచ్‌ను అందుకున్నాడు. కానీ, అప్పటికే బౌండరీ లైన్ తొక్కేశాడు. అది చూసుకోకుండా బంతిని గాల్లోకి విసిరాడు. మరో ఫీల్డర్ ఆ బంతిని పట్టుకుని ఆయన కూడా బౌండరీ లైన్ క్రాస్ చేసి, మరోసారి బంతిని గాల్లోకి విసిరాడు. ఆ వెనుకాలే వచ్చిన మరో బౌలర్ కూడా అదే పని చేశాడు. ఇంకేముంది ఈ వీడియో కాస్త నెట్టింట్లో తెగ వైరలవుతోంది. ఫన్నీగా ఉండడంతో బాగా నవ్విస్తోంది.
మరోవైపు మ్యాచ్ విషయానికి వస్తే.. వరుణుడి కారణంగా ఓవర్లను 48 కి కుదించారు. టాస్ గెలిచిన సౌత్ ఆస్ట్రేలియా టీం తొలుత బ్యాటింగ్ చేసి 392 పరుగులను సాధించింది. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన క్వీన్స్‌లాండ్ కేవలం 40 ఓవర్లలో 312 పరుగులకే చాపచుట్టేసింది. అయితే ఈ మ్యాచ్‌లో సౌత్ ఆస్ట్రేలియా కెప్టెన్ ట్రెవీస్ హెడ్ ఫాస్టెస్ట్ ద్విశతకాన్ని సాధించాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో రెండు డబుల్ సెంచరీలు చేసిన ప్లేయర్‌గా చరిత్ర నెలకొల్పాడు.
Bit going on here… ??
? Watch the One-Day #MarshCup on @kayosports
? Story: https://t.co/bBt41B5Rpr pic.twitter.com/Suo8dJijes— Fox Cricket (@FoxCricket) October 13, 2021
Also Read: T20 World Cup 2021: బంగ్లాదేశ్‌కు షాకిచ్చిన ఐర్లాండ్ టీం.. టీ20 ప్రపంచకప్ వార్మప్‌లో ఘోర పరాజయం..!