ఎలా వస్తాయ్‌రా ఇలాంటి ఐడియాలు

Updated on: Nov 24, 2025 | 3:31 PM

భారీ ట్రాఫిక్ జామ్ అయినప్పుడు వాహనదారులు తీవ్ర అసహనానికి గురవుతారు. ఇటీవల ఒక వైరల్ వీడియోలో యువకుడు ట్రాఫిక్‌ను తప్పించుకోవడానికి ఆగివున్న ట్రక్కు కిందనుంచి బైకును నడిపి సాహసం చేశాడు. ఇది ప్రమాదకరమైన చర్య అయినప్పటికీ, అతని ధైర్యం నెటిజన్లను ఆశ్చర్యపరిచింది. ఇలాంటి చర్యలు రోడ్డు భద్రతకు హానికరం అని గుర్తుంచుకోవాలి.

ఎవరైనా కారు, బైక్‌లో రోడ్డు మీద వెళ్తున్నప్పుడు భారీగా ట్రాఫిక్‌ జామ్‌ అయితే తీవ్ర అసహనానికి గురవుతారు. నడిచి వెళ్లేవారు ఎలాగో చిన్న చిన్న ఖాళీ ప్రదేశాల్లోనుంచైనా వెళ్లిపోతారు. కానీ బైకులపైన వెళ్లేవాళ్లు, కార్లలో వెళ్లేవారికి అది సాధ్యం కాదు. ఈక్రమంలో గంటలు గంటలు ట్రాఫిక్‌లో చిక్కుకొని తీవ్ర అసహనానికి గురవుతారు. కొందరు బైకులపై వెళ్లేవారు ఏదొక చిన్న దారి దొరికినా అటువైపు వెళ్లడానికి ప్రయత్నిస్తారు. అలాంటి వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట వైరల్‌ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఎలా వస్తాయిరా ఇలాంటి ఐడియాలు అంటూ కామెంట్లు చేస్తున్నారు. నెట్టింట వైరల్‌ అవుతున్న ఈ వీడియోలో అది హైవే అనుకుంటా.. రోడ్డుపైన భారీగా వాహనాలు నిలిచిపోయాయి. కార్లు, పెద్ద పెద్ద వాహనాలు, ట్రక్కులు, కంటైనర్లు చాలా నిలిచిపోయాయి. వాటి మధ్యలో బైకులు కూడా నిలిచిపోయి ఉన్నాయి. అయితే ఈ చిన్న వాహనదారులు ఏదైనా చిన్న సందు దొరికితే అందులోంచి వెళ్లిపోదాం.. ట్రాఫిక్‌నుంచి బయటపడదాం అని చూస్తారు. ఈ క్రమంలో ఓ యువకుడు ట్రాఫిక్‌నుంచి తప్పించుకోడానికి పెద్ద సాహసమే చేశాడు. ఆగిఉన్న పెద్ద ట్రక్కు కిందనుంచి బైకును నెమ్మదిగా పోనిస్తూ ఇవతలికి వచ్చాడు. అతని టైం బావుండి క్షేమంగా బయటకు వచ్చాడు కానీ.. అదే సమయంలో ట్రాఫిక్‌ ముందుకు కదలి ఆ ట్రక్‌ మూవ్‌ అయితే అతని పరిస్థితి మరోలా ఉండేది. ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలియలేదు. కానీ ఆ యువకుడు అలా ట్రక్కు కిందనుంచి బైక్‌పై వస్తున్న దృశ్యాలను ఎవరో రికార్డు చేసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడంతో అది విపరీతంగా వైరల్‌ అవుతోంది. ట్రక్కు కిందనుంచి సేఫ్‌గా ఇవతలికి వచ్చిన అతను సాధించాను అన్నట్టుగా థమ్స్‌అప్‌ చూపిస్తూ సంతోషంగా అక్కడినుంచి వెళ్లిపోయాడు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

పేర్చిన వస్తువులు టకటకా పడిపోతున్నాయ్..! తొంగి చూస్తే హడల్