ప్రియురాలిని వశం చేసుకోవాలని చేయకూడని పని చేసాడు.. చివరికి
కొందరు ప్రేమ పేరుతో యువతులపై వేధింపులకు పాల్పడితే.. మరికొందరు ప్రేమించిన యువతిని దక్కించుకునేందుకు చిత్రవిచిత్ర ప్రయత్నాలు చేస్తారు. చివరికి ఆ ప్రయత్నాలు బెడిసి కొట్టి అడ్డంగా బుక్కయిపోతుంటారు. తాజాగా తిరుపతిలో అలాంటి ఘటనే జరిగింది. ప్రేమించి యువతిని వశం చేసుకోడానికి ప్రయత్నించిన యువకుడు ఆమె కుటుంబ సభ్యులు, స్థానికుల చేతిలో చావుదెబ్బలు తిన్నాడు.
చంద్రగిరి మండలం పెనుమూరుకు చెందిన సురేష్ అనే యువకుడు మల్లయ్యపల్లికి చెందిన యువతిని ప్రేమించాడు. తాను ప్రేమించిన అమ్మాయిని ఎలాగైనా దక్కించుకోవాలని భావించాడు. అందుకు మార్గం చూపమంటూ ఓ మాంత్రికుడిని కలిసాడు. అతను ఏదో మంత్రించిన విభూది, యంత్రాన్ని ఇచ్చి ఆ అమ్మాయి ఇంటికి వెళ్లి యువతికి తాయెత్తు కట్టి మంత్రం పఠించమని చెప్పాడు. దాంతో సురేష్ వశీకరణ యంత్రంతో అమావాస్య రోజు అర్ధరాత్రి యువతి ఇంటికి చేరుకున్నాడు. యువతి ఉండే ఇంటి గోడ దూకే ప్రయత్నం చేశాడు. ఎవరో గోడ దూకుతున్నట్టు గమనించిన ఇంట్లోని ఓ పెద్దావిడ కేకలు వేసింది. ఈలోపు అప్రమత్తమైన గ్రామస్తులు సురేష్‌ను పట్టుకునే ప్రయత్నం చేశారు. గ్రామస్తులు వెంటాడడంతో తిరగబడి రాళ్లు విసిరిన యువకుడు తప్పించుకునే ప్రయత్నం చేశాడు. దొంగగా భావించి వెంటపడ్డ గ్రామస్తులు ముళ్లపొదల్లో దాక్కున్న సురేష్‌ను పట్టుకుని చావబాదారు. అక్కడే ఉన్న విద్యుత్ స్తంభానికి కట్టేసి దేహశుద్ధి చేశారు. యువకుడిని ఎందుకు వచ్చావని ఆరా తీయగా అసలు విషయం బయటపెట్టడంతో విషయం గ్రామస్తులకు అర్థమైంది. యువకుడి వద్ద ఉన్న కత్తి, తాయత్తులు, మంత్రించిన నల్లని పౌడర్ లభించడంతో గ్రామస్తులు మరింతగా రెచ్చిపోయారు. మహిళలు కూడా చావబాదారు. అనంతరం సురేష్‌ను పోలీసులకు అప్పగించారు. గ్రామస్తుల చెంప దెబ్బలకు గాయపడ్డ సురేష్ దొంగ కాదని నిర్ధారించుకున్న పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చారు. పెనుమూరులో ఉన్న కుటుంబ సభ్యులను పిలిపించి వారికి అప్పగించారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch: