రూ. 30 ఇచ్చి పావ్‌భాజీ తిని.. రూ.3 కోట్లు దోచేశారు.. ఆ తర్వాత
వ్యాపారంలో దివాలా తీసిన ఓ వ్యక్తి.. నష్టాన్ని పూడ్చుకోడానికి దొంగతనం ప్లాన్ చేశాడు. మరో ముగ్గురిని కూడగట్టి.. అందరూ కలిసి మాస్కులు పెట్టుకుని పక్కా స్కెచ్‌తో ఓ జ్యువెలరీ షాపులో రూ.3 కోట్లకు పైగా నగలు కొట్టేసి.. కూల్‌గా బయటికి వచ్చారు. కానీ, దారిలో పావ్ భాజీ దుకాణం కనిపించటంతో..వారిలో ఒకడికి నోరూరింది. వద్దంటున్నా వినకుండా వెళ్లి పావ్ భాజీ తిని.. ఫోన్ పే చేసి వచ్చాడు.
తర్వాత ఆ పావ్ భాజీ తిన్న దొంగ.. పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు. అతడి నుంచి పోలీసులు 2.8 కిలోల బంగారం, రూ. 4.8 లక్షల క్యాష్ స్వాధీనం చేసుకున్నారు. మిగతా నిందితుల కోసం గాలిస్తున్నారు.వ్యాపారంలో దివాలా తీసిన ఓ వ్యక్తి.. నష్టాన్ని పూడ్చుకోడానికి దొంగతనం ప్లాన్ చేశాడు. మరో ముగ్గురిని కూడగట్టి.. అందరూ కలిసి మాస్కులు పెట్టుకుని పక్కా స్కెచ్‌తో ఓ జ్యువెలరీ షాపులో రూ.3 కోట్లకు పైగా నగలు కొట్టేసి.. కూల్‌గా బయటికి వచ్చారు. కానీ, దారిలో పావ్ భాజీ దుకాణం కనిపించటంతో..వారిలో ఒకడికి నోరూరింది. వద్దంటున్నా వినకుండా వెళ్లి పావ్ భాజీ తిని.. ఫోన్ పే చేసి వచ్చాడు. తర్వాత ఆ పావ్ భాజీ తిన్న దొంగ.. పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు. అతడి నుంచి పోలీసులు 2.8 కిలోల బంగారం, రూ. 4.8 లక్షల క్యాష్ స్వాధీనం చేసుకున్నారు. మిగతా నిందితుల కోసం గాలిస్తున్నారు. భారీ చోరీకి పాల్పడిన దొంగలు.. చిన్న పొరపాటుతో దొరికిపోయారు. ఈ ఘటన కర్ణాటకలోని కల్‌బుర్గిలో జరిగింది. జులై 11వ తేదీన మాలిక్ అనే జ్యువెలరీ వ్యాపారి దుకాణంలో దొంగతనం జరిగింది. ముఖాలకు మాస్క్‌లు ధరించి దుకాణంలోకి చొరబడిన నలుగురు వ్యాపారిని బెదిరించి రూ. 3.15 కోట్ల విలువైన సొత్తును దోచుకున్నారు. భయపెట్టి లాకర్ తెరిపించి.. డబ్బు, నగదు ఎత్తుకెళ్లారు. దొంగతనం గురించి బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. చోరీకి వచ్చిన ఈ ముఠాలోని ఫరూక్ అనే వ్యక్తి దుకాణం బయట కాపలా కాశాడు. మిగతా ముగ్గురూ దుకాణం నుంచి బయటకు వచ్చిన తర్వాత, ఫరూక్ కు పావ్ బాజీ తినాలనిపించింది. దీంతో అతడు దగ్గరలో ఉన్న బండి దగ్గరకు వెళ్లాడు. అక్కడ సీసీటీవీ కెమెరాలో ఇది రికార్డయ్యింది. పావ్ బాజీ తిన్న తర్వాత అక్కడ రూ.30 ఫోన్‌పే ద్వారా చెల్లించాడు. ఈ లావాదేవీ ద్వారా పోలీసులు అతడి ఫోన్ నెంబర్‌ను గుర్తించి అరెస్ట్ చేసారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఆ డ్రోన్ల చక్కర్లు అందుకేనా..? ఆ పంట పండిస్తే అంతే
వర్షాకాలంలో ఏసీని ఇలా వాడితే.. పొడిగా మారే ఇల్లు..
వీర్య నిరోధక మాత్ర పనిచేస్తుంది
పొదుపు చేయలేదు.. జాబ్ పోయింది.. టెకీ ఆవేదన
ప్రాణాలకు తెగించి వృద్ధ దంపతుల వీరోచిత పోరాటం
మెస్సికి కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చిన అనంత్ అంబానీ..
నీరు తోడుతుండగా వచ్చింది చూసి.. పరుగో పరుగు..
జోరు వానలో చిక్కుకున్న ఏనుగు.. గొడుగుగా మారిన తల్లి ఏనుగు..
6 నెలలు చికెన్ మాత్రమే తిన్న యువతి.. చివరకు ఆస్పత్రిలో చేరి..
తవ్వకాల్లో బయటపడ్డ దుర్గమాత విగ్రహం

