తిరుమలలో తొలిరోజు 20 గంటలపాటు ఉత్తర ద్వార దర్శనం వీడియో
వైకుంఠ ఏకాదశి, ద్వాదశి పర్వదినాలను పురస్కరించుకుని తిరుమలలో భక్తుల భద్రత కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు టీటీడీ అదనపు ఈవో వెంకయ్యనాయుడు వెల్లడించారు. భక్తుల రద్దీ దృష్ట్యా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు.
తొలిరోజు ప్రొటోకాల్ దర్శనాలు ముగిసిన వెంటనే స్లాటెడ్ సర్వదర్శనం మొదలవుతాయని, సోమవారం అర్ధరాత్రి తర్వాత 1:30 నుంచి మంగళవారం రాత్రి 11:45 గంటల మధ్య.. 20 గంటల పాటు సామాన్యులకు దర్శనం అవకాశం కల్పిస్తామని తెలిపారు. సుమారు 70వేల మందికి దర్శనం చేయించాలన్నది లక్ష్యమన్న ఆయన, ఏ రోజు టోకెన్ పొందితే, అదేరోజు దర్శనం చేయించేలా పక్కాగా అమలుచేస్తామని తెలిపారు. ఇందుకోసం ఏఐ కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను వినియోగించనున్నామని తెలిపారు. భక్తులు టోకెన్‌పై నిర్దేశించిన సమయానికి, సూచించిన ప్రదేశానికి చేరుకోవాలని సూచించారు. క్యూలైన్లలో వేచి ఉండే భక్తులకు పులిహోర, చక్కెర పొంగలి, దద్దోజనం తదితర 16 రకాల ఆహార పదార్థాలు అందించేందుకు సిద్ధం చేస్తున్నట్టు వివరించారు. మొదటి మూడు రోజులు 24 గంటలూ అన్నప్రసాదాలు, కాఫీ, టీ, బాదం పాలు, చిన్నపిల్లలకు ప్రత్యేకంగా పాలు సిద్ధం చేస్తున్నట్టు పేర్కొన్నారు.
మరిన్ని వీడియోల కోసం :