TikTok Turkish: సూసైడ్‌ చేసుకున్న టిక్‌టాక్ స్టార్, షాక్‌లో ఫ్యాన్స్‌.!

TikTok Turkish: సూసైడ్‌ చేసుకున్న టిక్‌టాక్ స్టార్, షాక్‌లో ఫ్యాన్స్‌.!

Anil kumar poka

|

Updated on: Oct 05, 2024 | 3:51 PM

"వెడ్డింగ్ విత్ ఎ గ్రూమ్" అంటూ తనను తాను పెళ్లి చేసుకున్న టిక్‌టాక్ స్టార్ కుబ్రా అయ్‌కుట్ అనూహ్యంగా ప్రాణాలు విడిచింది. టర్కీలోని ఐదో అంతస్తులో తన అపార్ట్‌మెంట్‌ నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడటం సోషల్‌ మీడియా ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. 26 ఏళ్ల ‘సోలోగామి’ ఫేమ్ ఇన్‌ఫ్లుయెన్సర్ అయుకుట్‌ 2023లో విలాసవంతమైన వివాహ వేడుక, వీడియో ఫోటోలతో ఇంటర్నెట్‌లో అనేక ప్రశ్నల్ని లేవనెత్తింది.

“వెడ్డింగ్ విత్ ఎ గ్రూమ్” అంటూ తనను తాను పెళ్లి చేసుకున్న టిక్‌టాక్ స్టార్ కుబ్రా అయ్‌కుట్ అనూహ్యంగా ప్రాణాలు విడిచింది. టర్కీలోని ఐదో అంతస్తులో తన అపార్ట్‌మెంట్‌ నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడటం సోషల్‌ మీడియా ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. 26 ఏళ్ల ‘సోలోగామి’ ఫేమ్ ఇన్‌ఫ్లుయెన్సర్ అయుకుట్‌ 2023లో విలాసవంతమైన వివాహ వేడుక, వీడియో ఫోటోలతో ఇంటర్నెట్‌లో అనేక ప్రశ్నల్ని లేవనెత్తింది. ఇపుడు తన ఆకస్మిక మరణంతో కూడా అనేక ప్రశ్నల్ని మిగిల్చి వెళ్లిపోయింది . టర్కీ దేశపు స్థానిక మీడియా ప్రకారం సెప్టెంబర్ 23న టిక్‌టాక్ స్టార్ కుబ్రా అయ్‌కుట్ చనిపోయింది. ఆమె ఆత్మహత్యకు కొద్దిసేపటి ముందు, కుబ్రా తన ఇంటిని శుభ్రం చేస్తూ టిక్‌టాక్ వీడియోలో కనిపించడంతో ఈ ఘటన ప్రమాదవశాత్తూ జరిగిందా లేక ఆత్మహత్యా అనే చర్చకు దారి తీసింది. అయితే సూసైడ్‌ నోట్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తనకు టిక్‌టాక్‌లో 10 లక్షలకు పైగా ఫాలోవర్లు, ఇన్‌స్టాగ్రామ్‌లో రెండు లక్షలకు పైగా ఫాలోవర్లున్నారు.

ఇష్టపూర్వకంగానే దూకబోతున్నట్లు సూసైడ్‌ నోట్‌లో కుబ్రా రాసింది. ఎందుకంటే తనకు ఇక జీవించాలని లేదని అందులో తెలిపింది. జీవితంలో అందరికీ మంచిదానిగా ఉన్నాననీ ఇక మంచిగా ఉండలేననీ అంది. మంచిగా బతకడం వల్ల తనకేమీ ఒరగలేదనీ రాసుకొచ్చింది. స్వార్థం ఉంటేనే సంతోషంగా ఉంటారనీ చాలా రోజులుగా కష్టపడుతున్నా ఎవరూ గమనించలేదనీ లెటర్ లో పేర్కొంది. తనను తాను ప్రేమించుకుంటున్నానని.. వెళ్లిపోతున్నానని.. తనను క్షమించాలని కోరింది. అనూహ్యంగా బరువు తగ్గడంపై ఆమె బాగా ఆందోళనలో ఉన్నట్లు తెలిసింది. మరణానికి కొద్ది గంటల ముందు, సోషల్ మీడియాలో పోస్ట్‌ చేసింది. తను బరువు పెరగడం లేదనీ..తాను 44 కిలోగ్రాములకు పడిపోయినట్లు చెప్పింది. ప్రతిరోజూ ఒక కిలోగ్రాము తగ్గుతూ వస్తున్నాననీ ఈ పరిస్థితుల్లో ఏం చేయాలో తనకు తెలియదని తను అత్యవసరంగా బరువు పెరగాలని రాసింది. గత కొన్నిరోజులుగా వస్తున్న ఇలాంటి పోస్ట్‌లపై అనుచరులు కూడా ఆందోళన వ్యక్తం చేశారు. వారి భయాలను నిజం చేస్తూ ఆమె తీసుకున్న కఠిన నిర్ణయం ఫ్యాన్స్‌ను విషాదంలో ముంచేసింది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.