Tickles Tree: చక్కిలిగింతల చెట్టును ఎప్పుడైనా చూశారా ముట్టుకుంటే నవ్వుతుంది.. వైరల్ అవుతున్న వీడియో..

Tickles Tree: చక్కిలిగింతల చెట్టును ఎప్పుడైనా చూశారా ముట్టుకుంటే నవ్వుతుంది.. వైరల్ అవుతున్న వీడియో..

Anil kumar poka

|

Updated on: Nov 29, 2021 | 11:58 AM

మీకు రకరకాల చెట్ల గురించి తెలుసు.. కానీ కిత కితల చెట్టు గురించి తెలుసా? అవును.. ఈ చెట్లకి మనుషుల్లాగే కితకితలు ఉంటాయట. టచ్‌ మి నాట్‌ మొక్క గురించి మీకు తెలుసుకదా.. ముట్టుకుంటే దాని ఆకులు ముడుచుకుపోతాయి...


మీకు రకరకాల చెట్ల గురించి తెలుసు.. కానీ కిత కితల చెట్టు గురించి తెలుసా? అవును.. ఈ చెట్లకి మనుషుల్లాగే కితకితలు ఉంటాయట. టచ్‌ మి నాట్‌ మొక్క గురించి మీకు తెలుసుకదా.. ముట్టుకుంటే దాని ఆకులు ముడుచుకుపోతాయి. అలాగే కితకితల చెట్టు మనం దానిని నిమిరినట్టు చేశామనుకోండి కిలకిలా నవ్వుతుంది. అయితే ఇది ఎక్కడుంది? ఇది ఎలా నవ్వగలుగుతుందో తెలుసుకుందాం…

గడ్డి మైదానాల్లో పెరిగే ఈ చెట్టును మొదటిసారిగా శాస్త్రవేత్త జెస్సే బోస్‌ కనిపెట్టారు. ఈ చెట్లు చాలా సున్నితమైనవట. “మనుషుల సైగలను బట్టి కూడా ఈ చెట్లు స్పందిస్తాయి. కానీ మనం ఆ స్పందనలను చూడలేం” అని జెస్సే బోస్ తెలిపినట్లు కటార్నియా వైల్డ్ లైఫ్ శాంక్చురీ DFO యశ్వంత్ చెప్పారు. మనుషులు నవ్వినప్పుడు సౌండ్‌ వచ్చినట్లు ఈ చెట్లు నవ్వినప్పుడు సౌండ్‌ రాదు. మనం దానిని తాకినిప్పుడు దానికి కితకితలు వస్తున్నాయి… ప్లీజ్‌ వద్దు.. అన్నట్లుగా ఆ చెట్టు అటూ ఇటూ కదులుతుందట. దాని ఆకులు,కొమ్మలు చిన్నగా కదులుతాయట. ఇదే దాని ప్రత్యేకత. గాలి వీచే సమయంలోనే ఈ చెట్లు ఊగుతాయట. మిగతా సమయాల్లో వాటంతట అవి ఊగవట. అయితే మనం ఈ చెట్టుని నిమిరినప్పుడు చిన్నగా కదులుతుందట.. అదేనండి కితకితలు వస్తాయికదా.. అందుకే కదులుతుంది. అందువల్లే దీన్ని చక్కిలిగింతల చెట్టు అని పిలుస్తున్నారట.

ఈ చెట్టు సైంటిఫిక్ నేమ్ రండియా డ్యుమెటోరమ్ (Randia Dumetorum). దీని కాండం నుంచి సెన్సిటివ్ సెన్సార్లు చెట్టు అంతటా ప్రవహిస్తాయట. అందువల్లే ముట్టుకోగానే కొమ్మలు, ఆకులూ ఊగుతాయట. ఉత్తరప్రదేశ్‌లో అక్కడక్కడా కనిపించే ఈ చెట్లు అంతరించిపోతున్న చెట్ల జాతుల్లో ఉన్నాయి. ఈ చెట్ల సంఖ్యను పెంచడానికి ఎంతగా ప్రయత్నిస్తున్నా కుదరట్లేదట. ఎన్నోసార్లు ఈ చెట్టు గింజలు, కాండాలను పాతిపెట్టి… కొత్త మొక్కలు వచ్చేలా ప్రయత్నించినా ఫలితం రాలేదట. ఇప్పుడు గ్రాఫ్టింగ్ విధానంలో కొత్త మొక్కలను సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారు.

మరిన్ని చూడండి ఇక్కడ:

Icon Star Allu Arjun Pushpa: సోషల్ మీడియాలో పుష్పరాజ్ సందడి.. ట్రెండ్ అవుతున్న అల్లు అర్జున్ పుష్ప లుక్స్..

jr.NTR in RRR: ఆర్ఆర్ఆర్ లో ఎన్టీఆర్.. సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న తారక్ లుక్స్ అండ్ పోస్టర్స్..

Balakrishna Trending looks: సోషల్ మీడియాలో సింహ గర్జన.. బాలయ్య న్యూ మూవీ లుక్.. ట్రెండ్ అవుతున్న ఫొటోస్..