పగలు కూలీలు.. రాత్రి అయితే కేడీలు.. ఏం ఎత్తుకెళ్తున్నారో తెలిస్తే షాక్

|

Sep 12, 2023 | 4:37 PM

హైదరాబాద్ మహానగరంలో కొత్త రకం దొంగల ముఠా రెచ్చిపోతుంది. ఇళ్లలోకి చొరబడి దొంగతనాలకు పాల్పడుతున్న ముఠాలను గురించి విన్నాం. మొబైల్ ఫోన్ల చోరీలు, చైన్ స్నాచింగ్స్ సర్వసాధారణం. రాత్రింబగుళ్ళు తేడా లేకుండా రెక్కీ నిర్వహించి.. పక్కా ప్లాన్‌తో అందినకాడికీ దోచుకొని వెళ్తుంటారు. కానీ దొంగలలో ఈ దొంగలు వేరు. ఫోన్స్, ఇళ్లలో చోరీ రొటీన్ అనుకున్నారేమో.. ఏకంగా మూగ జీవాలనే టార్గెట్ చేశారు. ఆ ఊరిలో చీకటి పడుతుందంటే చాలు గొర్రెలు మాయం అవుతాయి.

హైదరాబాద్ మహానగరంలో కొత్త రకం దొంగల ముఠా రెచ్చిపోతుంది. ఇళ్లలోకి చొరబడి దొంగతనాలకు పాల్పడుతున్న ముఠాలను గురించి విన్నాం. మొబైల్ ఫోన్ల చోరీలు, చైన్ స్నాచింగ్స్ సర్వసాధారణం. రాత్రింబగుళ్ళు తేడా లేకుండా రెక్కీ నిర్వహించి.. పక్కా ప్లాన్‌తో అందినకాడికీ దోచుకొని వెళ్తుంటారు. కానీ దొంగలలో ఈ దొంగలు వేరు. ఫోన్స్, ఇళ్లలో చోరీ రొటీన్ అనుకున్నారేమో.. ఏకంగా మూగ జీవాలనే టార్గెట్ చేశారు. ఆ ఊరిలో చీకటి పడుతుందంటే చాలు గొర్రెలు మాయం అవుతాయి. దీంతో ఫోకస్ పెట్టిన పోలీసులు.. దొంగతనానికి పాల్పడుతున్న ముఠాను అరెస్ట్ చేశారు. ఆగస్టు 28న వికారాబాద్ జిల్లా పూడూరు మండలం రేగడి మామిడిపల్లిలో 20 గొర్రెలు కనిపించకుండాపోయాయి. దీంతో రాములు అనే గొర్రెల కాపరి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో సిసి టివి ఫుటేజ్ ల ఆధారంగా నేరస్థులను గుర్తించారు పోలీసులు. ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లా దేవన కొండ, యమ్నూరు, పెద్ద కడవూరుకు చెందిన ఎనిమిది మంది ముఠాగా ఏర్పడి దొంగతనాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు తెలిపారు. పదేళ్ళుగా వేర్వేరు రాష్ట్రాల్లో గొర్రెలను దొంగిలించి హైదరాబాద్‌లోని మార్కెట్‌లో అమ్మి సొమ్ము చేసుకుంటున్నట్లు వెల్లడించారు. ఈ ముఠా సభ్యులు పగటిపూట కూలి పనివారిగా.. గ్రామాల్లో సంచరిస్తూ గొర్రెల మందలను గుర్తించి రాత్రిపూట చోరీలకు పాల్పడుతున్నట్టు పోలీసులు తెలిపారు. ఐదుగురు నిందితులను అరెస్టు చేసిన పోలీసులు.. పరారీలో ఉన్న మరో ముగ్గురి కోసం గాలిస్తున్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఒంటి నిండా గాయాలతో కొండచిలువ.. ఎన్ని కుట్లు వేశారో తెలుసా ??

చూస్తుండగానే మనుషులు అదృశ్యం !! నెట్టింట వైరల్‌ అవుతున్న షాకింగ్‌ వీడియో

క్రికెటర్‌ ఇంట్లో దూరిన కొండచిలువ..ఏం చేశాడో చూడం

Pushpa 2: బంగారం లాంటి అప్డేట్ !! రిలజ్ డేట్ వచ్చేసిందోచ్‌ !!

Miss. Shetty Mr. Polishetty: హాలీవుడ్ గడ్డపై.. పొలిశెట్టి దిమ్మతిరిగే రికార్డ్‌