Viral: కర్నూలులో రెచ్చిపోయిన దొంగలు.! టరి మహిళలే టార్గెట్‌.. మత్తుజల్లి మరీ.

|

Feb 10, 2024 | 6:45 PM

ఇంట్లో ఒంటరిగా ఉన్న మహిళను టార్గెట్ చేస్తూ దొంగలు రెచ్చిపోతున్నారు. తాజాగా ఓ మహిళకు మాయమాటలు చెప్పి ఆమెకు మత్తుమందు ఇచ్చి మెడలో ఉన్న నాలుగు తులాల బంగారు చైన్ ఎత్తుకెళ్లిన ఘటన కర్నూలు జిల్లా చోటుచేసుకుంది. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో లక్ష్మీపేట లో నివాసం ఉంటున్నా ఉమాదేవి ఇంటికి ఇద్దరు వ్యక్తులు వచ్చారు. ఇంటి ముందు ఉన్న టైల్స్ ను ఓ లిక్విడ్ తో శుభ్రం చేసి చూపించారు.

ఇంట్లో ఒంటరిగా ఉన్న మహిళను టార్గెట్ చేస్తూ దొంగలు రెచ్చిపోతున్నారు. తాజాగా ఓ మహిళకు మాయమాటలు చెప్పి ఆమెకు మత్తుమందు ఇచ్చి మెడలో ఉన్న నాలుగు తులాల బంగారు చైన్ ఎత్తుకెళ్లిన ఘటన కర్నూలు జిల్లా చోటుచేసుకుంది. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో లక్ష్మీపేట లో నివాసం ఉంటున్నా ఉమాదేవి ఇంటికి ఇద్దరు వ్యక్తులు వచ్చారు. ఇంటి ముందు ఉన్న టైల్స్ ను ఓ లిక్విడ్ తో శుభ్రం చేసి చూపించారు. టైల్స్‌ మాత్రమే కాదు, ఇంట్లో పాతబడిన ఏ వస్తువునైనా ఇలా కొత్తవాటిలా మెరిపించే పౌడర్‌ తమ వద్ద ఉందని, అది చాలా బాగా పనిచేస్తుందని నమ్మబలికారు. ఆ పౌడర్‌ ఆమెకు ఇచ్చి పాతబడిపోయిన గిన్నెలో నీళ్లు పోసి అందులో ఆ పౌడర్‌ వేసి వేడిచేస్తే తెల్లగా వస్తుందని చెప్పారు. అనంతరం ఇంట్లో ఉన్న బంగారం కూడా ఇలా క్లిన్ చేస్తామని తీసుకురమ్మని చెప్పారు. ఇంట్లో ఉన్న గొలుసు తీసుకొచ్చి ఇచ్చారు. అనంతరం ఉమాదేవిని మాటల్లో పెట్టి ఒక పౌడర్‌ చల్లారు. వెంటనే ఉమాదేవి మత్తులోకి జారుకోగానే ఆమె మెడలోని బంగారు గొలుసులు రెండూ తీసుకొని అక్కడ్నుంచి పరారయ్యారు. ఉమాదేవికి మెలుకువ వచ్చేసరికి ఆమె మెడలో ఉన్న బంగారు గొలుసులు కనపడకపోయేసరికి వెంటనే భర్త తో కలిసి పట్టణ పోలీస్ లకు ఫిర్యాదు చేశారు. ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..