Thieves: చోరీ చేసిన డబ్బు చూపిస్తూ ఇన్‌స్టా రీల్‌.. ఒక దొంగ అరెస్ట్‌.. వీడియో.

|

Oct 09, 2023 | 12:00 PM

దొంగిలించిన డబ్బును చూసి దొంగలు మురిసిపోయారు. మంచంపై ఆ డబ్బును పరిచారు. చెల్లాచెదురుగా పడి ఉన్న డబ్బును చూపిస్తూ ఇన్‌స్టాగ్రామ్‌ రీల్‌ చేశారు. ఇది పోలీసుల దృష్టికి వెళ్లడంతో ఒక దొంగ అరెస్ట్‌ అయ్యాడు. ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో ఈ ఘటన జరిగింది. జ్యోతిష్కుడు తరుణ్ శర్మ ఇంట్లో ఇటీవల దొంగలుపడ్డారు. భారీగా డబ్బులు దోచుకున్నారు. దీంతో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సీసీటీవీలో రికార్డైన ఫుటేజ్‌ను కూడా అందజేశాడు.

దొంగిలించిన డబ్బును చూసి దొంగలు మురిసిపోయారు. మంచంపై ఆ డబ్బును పరిచారు. చెల్లాచెదురుగా పడి ఉన్న డబ్బును చూపిస్తూ ఇన్‌స్టాగ్రామ్‌ రీల్‌ చేశారు. ఇది పోలీసుల దృష్టికి వెళ్లడంతో ఒక దొంగ అరెస్ట్‌ అయ్యాడు. ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో ఈ ఘటన జరిగింది. జ్యోతిష్కుడు తరుణ్ శర్మ ఇంట్లో ఇటీవల దొంగలుపడ్డారు. భారీగా డబ్బులు దోచుకున్నారు. దీంతో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సీసీటీవీలో రికార్డైన ఫుటేజ్‌ను కూడా అందజేశాడు. చోరీ చేసిన డబ్బును చూసి దొంగలు మురిసిపోయారు. ఆ నగదును మంచంపై పరిచి ఇన్‌స్టాగ్రామ్‌ రీల్‌ చేశారు. ఒక వ్యక్తి తన చేతిలో రూ.500 నోట్లు పట్టుకున్నట్టు ఆ వీడియో క్లిప్‌లో కనిపిస్తుంది. మరోవైపు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయిన ఈ వీడియో క్లిప్‌ పోలీసుల దృష్టికి వెళ్లింది. ఈ నేపథ్యంలో సాంకేతిక ఆధారాలతో ఒక దొంగ ఆచూకీని గుర్తించి అతడ్ని అరెస్ట్ చేశారు. రెండు లక్షల డబ్బుతో పాటు రెండు మొబైల్‌ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. మిగతా నిందితుల కోసం ఆరా తీస్తున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..