Viral Video: చర్చిలో దోపిడీకి పాల్పడిన దొంగ.. నెట్టింట వీడియో వైరల్.!
పండగ పూట అందరూ సెలబ్రేషన్ మూడ్‌లో ఉంటే.. ఓ దొంగ మాత్రం అదును చూసి.. తన చేతి వాటం చూపించాడు. తమిళనాడులోని కన్యాకుమారిలో ఓ చర్చిలోకి చోరబడిన ఓ ప్రబుద్ధుడు..
పండగ పూట అందరూ సెలబ్రేషన్ మూడ్‌లో ఉంటే.. ఓ దొంగ మాత్రం అదును చూసి.. తన చేతి వాటం చూపించాడు. తమిళనాడులోని కన్యాకుమారిలో ఓ చర్చిలోకి చోరబడిన ఓ ప్రబుద్ధుడు.. విగ్రహంపై ఉన్న ఆభరణాలతో ఉడాయించాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు అక్కడే ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డు అయింది. భుజాన బ్యాగ్ వేసుకుని ఆంథోనియర్ చర్చిలోకి వచ్చిన దొంగ.. మొఖానికి మాస్క్ ధరించి దొంగతనంకు పాల్పడ్డాడు. ఫ్లోర్ క్లీన్ చేసే కర్రతో గ్లాస్‌ను పగలగొట్టి, దానిలోపల ఉన్న బంగారంతో జంప్ అయ్యాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు.
మరిన్ని ఇక్కడ చూడండి: Viral video: పామును కట్ చేసిన మహిళ.. చివరికి ఏమైందంటే.. వైరల్ అవుతోన్న వీడియో..
వైరల్ వీడియోలు
Latest Videos