ఇంటిని దోచేసి.. క్షమించమని లెటర్‌ రాసి వెళ్లిన దొంగ !!

|

Jul 08, 2024 | 9:30 PM

తమిళనాడులో ఓ టీచర్ ఇంటిని దోచేసిన దొంగ.. తనను క్షమించాలని, దోచుకున్న వస్తువులను నెల రోజుల్లో తిరిగి ఇచ్చేస్తానంటూ లేఖ రాసి మరీ వెళ్లాడు. మేగ్నానపురంలోని సాతంకుళం రోడ్డులో ఈ ఘటన జరిగింది. తమిళనాడుకు చెందిన సెల్వన్, ఆయన భార్య ఇద్దరూ రిటైర్డ్ ఉపాధ్యాయులే. చెన్నైలో ఉంటున్న తన కుమారుడిని చూసేందుకు జూన్ 17న వెళ్లారు. అయితే, తాము లేనప్పుడు ఇంటిని నిత్యం శుభ్రం చేసేందుకు సెల్వీ అనే పని మనిషిని పెట్టుకున్నారు.

తమిళనాడులో ఓ టీచర్ ఇంటిని దోచేసిన దొంగ.. తనను క్షమించాలని, దోచుకున్న వస్తువులను నెల రోజుల్లో తిరిగి ఇచ్చేస్తానంటూ లేఖ రాసి మరీ వెళ్లాడు. మేగ్నానపురంలోని సాతంకుళం రోడ్డులో ఈ ఘటన జరిగింది. తమిళనాడుకు చెందిన సెల్వన్, ఆయన భార్య ఇద్దరూ రిటైర్డ్ ఉపాధ్యాయులే. చెన్నైలో ఉంటున్న తన కుమారుడిని చూసేందుకు జూన్ 17న వెళ్లారు. అయితే, తాము లేనప్పుడు ఇంటిని నిత్యం శుభ్రం చేసేందుకు సెల్వీ అనే పని మనిషిని పెట్టుకున్నారు. జూన్ 26న ఇంటిని క్లీన్ చేసేందుకు వెళ్లిన సెల్వీ తలుపులు తెరిచి ఉండడం చూసి షాకయింది. వెంటనే ఆమె ఈ విషయాన్ని సెల్వన్‌కు ఫోన్ చేసి చెప్పింది. తక్షణం అక్కడికి చేరుకున్న ఆయన ఇంట్లో దొంగలు పడినట్టు గుర్తించారు. రూ. 60 వేల నగదు, 12 గ్రాముల బంగారు నగలు, వెండిపట్టీలు దోచుకెళ్లినట్టు నిర్ధారించుకున్నారు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు ఇంటిని తనిఖీ చేస్తుండగా దొంగ విడిచిపెట్టిన క్షమాపణ లేఖ కనిపించింది. తనను క్షమించాలని, దోచుకున్న వస్తువులను నెల రోజుల్లో తిరిగి ఇచ్చేస్తానని దొంగ ఆ లేఖలో హామీ ఇచ్చాడు. నన్ను క్షమించండి. మీ వస్తువులను మీకు నెల రోజుల్లో అప్పజెబుతాను. మా ఇంట్లో ఒకరికి ఆరోగ్యం బాగాలేకపోవడం వల్లే ఇలా చేయాల్సి వచ్చింది’’ అని దొంగ ఆ లేఖలో రాసుకొచ్చాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:.

ఉద్యోగుల జీతాలు పెంచిన యజమానులకు మూడేళ్లు జైలు..

1,300 ఏళ్ల నాటి ‘మాయా ఖడ్గం’ అదృశ్యం !!

జాలర్లకు చిక్కిన భారీ చేప.. కొనేందుకు ఎగబడిన జనం.. ఎందుకంటే ??