వీడు దొంగే…. కానీ నిజాయితీ ఉన్నోడు.. తనిఖీలో పట్టుబడ్డ వాహనాలు
హైదరాబాద్ పాతబస్తీలో అర్థరాత్రి మందుబాబులు రెచ్చిపోయారు. పోలీసులు నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్‌లో మందుబాబులు చేసిన హంగామా అంతాఇంతా కాదు. ఫలక్‌నుమా ప్రాంతంలో పోలీసులు తనిఖీలు చేపట్టారు. అదే సమయంలో ఓ వ్యక్తి నెంబర్ ప్లేట్ సరిగాలేని స్కూటీని తీసుకొచ్చాడు. అతనికి మొదట పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేస్తే ఆల్కహాల్ పర్సంటేజ్ ఏమీ చూపించలేదు. ఆ నెంబర్ ప్లేట్ సరిగా లేని బండి ఎవరిదని నిలదీశారు పోలీసులు.
హైదరాబాద్ పాతబస్తీలో అర్థరాత్రి మందుబాబులు రెచ్చిపోయారు. పోలీసులు నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్‌లో మందుబాబులు చేసిన హంగామా అంతాఇంతా కాదు. ఫలక్‌నుమా ప్రాంతంలో పోలీసులు తనిఖీలు చేపట్టారు. అదే సమయంలో ఓ వ్యక్తి నెంబర్ ప్లేట్ సరిగాలేని స్కూటీని తీసుకొచ్చాడు. అతనికి మొదట పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేస్తే ఆల్కహాల్ పర్సంటేజ్ ఏమీ చూపించలేదు. ఆ నెంబర్ ప్లేట్ సరిగా లేని బండి ఎవరిదని నిలదీశారు పోలీసులు. దీంతో సదరు వ్యక్తి వెంటనే ఔను సార్.. అది చోరీ చేసిన బండే అని ఒప్పేసుకున్నాడు. పోలీసులు చోరీ తప్ప కదా అంటే.. తప్పే సార్ వదిలేయండని ప్రాధేయపడ్డాడు. చివరికి అతన్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇక మరికొందరు మందుబాబులు పోలీసులకు చుక్కలు చూపించారు. పోలీసులు ఎంత చెప్పినా బ్రీత్ ఎనలైజర్‌లో సరిగా ఉదకుండా రకరకాల విన్యాసాలు ప్రదర్శించారు. కొందరు యువకులలైతే పోలీసులు కనపడగానే ఒక్కసారిగా రోడ్డుపై బండ్లు వదిలేసి అథ్లెట్ రేసుల్లా పరుగులు తీశారు. పోలీసులు సైతం ఏమాత్రం తగ్గకుండా సింగం సినిమా రేంజ్‌లో ఛేజ్ చేసి మందుబాబులను పట్టుకొచ్చి మరీ ఫైన్ వేశారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అరగంటపాటు గాల్లో తలక్రిందులుగా వేలాడిన జనం !! అసలు ఏం జరిగిందంటే ??
రంగులు మార్చే ఊసరవెల్లి చీర !! తయారీకి రూ. 2.8 లక్షలు ఖర్చు
ఏసీ వేసుకొని నిద్రపోయిన డాక్టర్.. అప్పుడే పుట్టిన ఇద్దరు బిడ్డలు మృతి
అయ్యబాబోయ్ కొండచిలువ.. అర్ధరాత్రి రోడ్డు దాటుతూ
రోడ్డు మీద దొరికితే పిల్లి అనుకొని తెచ్చి పెంచింది.. పెద్దయ్యాక చూస్తే షాక్