Stove on a Bike: ఏంది సామీ ఇదీ.. చలి మంట వేసుకోడానికి ప్లేసే దొరకలేదా..! వీడియో వైరల్..
దేశవ్యాప్తంగా చలిపులి పంజా విసురుతోంది. కొన్నిరోజులుగా అత్యంతక కనిష్టానికి పడిపోతున్న ఉష్ణోగ్రతలతో జనాలు గజగజా వణుకుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో ఇళ్లనుంచి బయటకు రావాలంటే భయపడుతున్నారు. కొందరు చలిమంటలు వేసుకొని చాలికాచుకుంటున్నారు.
వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఇద్దరు యువకులు బైక్‌పైన వెళ్తున్నారు. చలి విపరీతంగా ఉండటంతో ఆ యువకులకు ప్రయాణం ఇబ్బందిగా మారింది. దాంతో వారు బైక్ వెనుక సీటుపైన ఓ చిన్న కుంపటిని ఏర్నాటు చేసి, దానిలో చలిమంట వేసుకుని చలికాచుకుంటూ రోడ్డుపై దూసుకెళ్లారు. ఇది చూసిన మిగతా వాహనదారులు ఈ ఐడియా మనకెందుకు రాలేదు సుమీ.. అన్నట్టుగా ఆశ్చర్యంగా చూశారు. అంతేకాదు మీ ఐడియా సూపర్ అంటూ.. ఆ సంఘటనను వీడియో తీసి నెట్టింట పోస్ట్ చేశారు. దాంతో ఆ వీడియో తెగ వరల్ అవుతోంది. కాగా మధ్యప్రదేశ్ ఇండోర్‌లో ఈ ఘటన జరిగింది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Kantara Movie: అరెరె.. ‛కాంతార’ చిత్రంలో ఈ లాజిక్ ఎలా మిస్సయ్యారబ్బా..? వీడియో వైరల్..
